చిరుతో కాదు.. విజయ్ తో

చిరుతో కాదు.. విజయ్ తో

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి శరవేగంగా షూటింగ్ జరుకుంటోంది. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రలో నయనతార నటిస్తున్న సంగతి తెలిసిందే. చిరు-నయన్ లకు సంబంధించిన కొన్ని పిక్స్ కూడా ఇప్పటికే బైటకు వచ్చాయి. వారి లుక్స్ కూడా అద్భుతంగా ఉండడంతో మూవీపై ఆసక్తి ఇంకా ఎక్కువ అయిపోయింది.

అయితే.. సైరా చిత్రంలో నయనతారతో పాటు మరో ఇద్దరు హీరోయిన్స్ కు ఛాన్స్ ఉందనే టాక్ ముందు నుంచి ఉంది. కానీ ఆ రెండు పాత్రలు ఎవరు చేయనున్నారనే విషయం తేలలేదు. ఇలాంటి సమయంలో మిల్కీబ్యూటీ తమన్నా సైరా మూవీలో నటించాలనే ఉద్దేశ్యంతో.. సైరా టీంను అప్రోచ్ అయిందని.. ఆమెకు ఓ క్యారెక్టర్ ను ఆఫర్ చేశారని తెలుస్తోంది. దీంతో సైరా మూవీలో చిరుకు జోడీగా తమన్నా ఓ పాత్రలో నటించబోతోందని అంతా అనుకున్నారు. చిరుతో తమ్మూ జోడీ ఎలా ఉంటుందో అనే ఊహలు కూడా కట్టేశారు. కానీ అసలు విషయం వేరే ఉందట.

సైరా చిత్రంలో తమన్నా ఓ క్యారెక్టర్ ను పోషిస్తున్న మాట వాస్తవమే అయినా.. ఇది చిరంజీవికి జోడీగా నటించే రోల్ కాదని తెలుస్తోంది. ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్న తమిళ స్టార్ విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నాడు. ఈ విజయ్ సేతుపతి పాత్రకు జోడీగానే మిల్కీ బ్యూటీ యాక్ట్ చేయనుందని తెలుస్తోంది. అయితే.. తెలుగులో అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న మూవీ.. అందులోను చిరంజీవి చిత్రం కావడంతో.. తమన్నా ఏ మాత్రం సందేహించకుండా ఈ రోల్ కు యాక్సెప్ట్ చేసిందట.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English