ఎన్టీఆర్‌ కోసం ఆమె రెడీ, కండిషన్స్‌ అప్లయ్‌!

ఎన్టీఆర్‌ కోసం ఆమె రెడీ, కండిషన్స్‌ అప్లయ్‌!

బాలకృష్ణతో తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. బాలయ్య సహ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ చిత్రం కాస్టింగ్‌, టెక్నికల్‌ టీమ్‌ పరంగా చాలా ప్రతిష్టాత్మకంగా వుండేట్టు చూస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్‌ సతీమణి పాత్రకి విద్యాబాలన్‌ స్థాయి వున్న నటి కావాలని పట్టుబట్టారు. విద్యాబాలన్‌ ఈ పాత్ర పోషించేందుకు సుముఖత వ్యక్తం చేసినా కానీ ఇంతవరకు అగ్రిమెంట్‌పై సంతకం చేయలేదు, అడ్వాన్స్‌ కూడా స్వీకరించలేదట. ఈ పాత్ర తాను చేయాలంటే కొన్ని కండిషన్లు వున్నాయని ఆమె చెప్పిందట.

ఎన్టీఆర్‌ జీవిత కథ అనేసరికి భార్య పాత్రకి ఎక్కువ స్కోప్‌ వుండకపోవచ్చునని విద్యాబాలన్‌ మేనేజర్స్‌ చెప్పడంతో తన పాత్ర నిడివి ఏమిటి, ఎన్ని సన్నివేశాలుంటాయి లాంటివి విద్యాబాలన్‌ అడుగుతోందట. తనపై తీసిన సన్నివేశాలన్నీ ఫైనల్‌ కట్‌లో వుండాలని, ఆ సన్నివేశాలని ఎడిట్‌ చేసి కేవలం అతిథి పాత్ర మాదిరిగా కనిపించేట్టు చేయరాదని కండిషన్‌ పెడుతోందట. అందుకు తగ్గట్టుగా రాత పూర్వకంగా అగ్రిమెంట్‌ చేసుకుంటే తప్ప ఈ పాత్ర చేయనని ఆమె స్పష్టం చేయడంతో తన కండిషన్స్‌కి ఓకే చెప్పాలా లేదా అనే మీమాంసలో 'ఎన్టీఆర్‌' యూనిట్‌ వున్నట్టు సమాచారం. ఇది విద్యాబాలన్‌కి తొలి తెలుగు చిత్రం కనుక, బాలీవుడ్‌లో ఫిమేల్‌ ఓరియెంటెడ్‌ మూవీస్‌ చేసే స్థాయి కనుక తన పాత్ర ఎట్టి పరిస్థితుల్లోను గొప్పగా వుండాలనేది ఆమె ఖచ్చితమైన అభిప్రాయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు