పవన్‌ ఫాన్స్‌ చరణ్‌కి షిఫ్ట్‌ అయినట్టే

పవన్‌ ఫాన్స్‌ చరణ్‌కి షిఫ్ట్‌ అయినట్టే

పవన్‌కళ్యాణ్‌ ఎమోషన్స్‌ని పబ్లిక్‌లో డిస్‌ప్లే చేయడం చాలా చాలా అరుదు. తన రాజకీయ ఉపన్యాసాల్లో ఎమోషన్‌ వుంటుంది కానీ సినిమాలకి సంబంధించిన వేదికలపై మాట్లాడేటపుడు పవన్‌ చాలా ముక్తసరిగా మాట్లాడేస్తాడు. తన సినిమాల గురించే ఎక్కువ మాట్లాడని పవన్‌ 'రంగస్థలం' విజయోత్సవ సభలో మాట్లాడిన తీరుకి అతని వీరాభిమానులే అవాక్కయ్యారు. 'పవన్‌ ఏంటి ఇంత మాట్లాడేసాడు' అంటూ సోషల్‌ మీడియాలో చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేసారు. తనకి 'రంగస్థలం' ఎంత నచ్చిందో పవన్‌ చెప్పడమే కాకుండా, అన్న కొడుకుపై వాత్సల్యం కూడా అదే రీతిన చూపించాడు. చరణ్‌ ఉత్తమ నటనకి పవన్‌ చాలా ఇంప్రెస్‌ అయిపోయాడని అతని మాటల్లోనే తెలిసింది.

నిజానికి షో వేసిన తర్వాత పవన్‌ కాసేపు మీడియాతో మాట్లాడితే చాలని చరణ్‌ భావించాడు. కానీ ఈ సినిమా గురించి విజయోత్సవ సభలో మాట్లాడతానని చెప్పిన పవన్‌ ఎవరినీ నిరాశపరచలేదు. టీమ్‌లోని ప్రతి ఒక్కరినీ పేరుపేరునా అభినందించడమే కాకుండా చరణ్‌ని 'సంపూర్ణ నటుడు' అంటూ కితాబిచ్చాడు. ఎంత ఎదిగినా ఒదిగి వుండే తన లక్షణం తనకి చాలా ఇష్టమని వేదికపైనే 'తమ్ముడు'కి ముద్దిచ్చాడు. పవన్‌, చరణ్‌ల మధ్య వున్న అనుబంధం ఏమిటనేది ఈ వేదిక సాక్షిగా చూసిన మెగా అభిమానులు పులకించిపోతున్నారు. పవన్‌ సినిమాల నుంచి విరామం తీసుకోవడంతో అతని ఎక్స్‌క్లూజివ్‌ అభిమానులు డీలా పడ్డారు. తన అభిమానులందరికీ ఇతనే నా వారసుడు అని పవన్‌ అన్యాపదేశంగా ఈ వేడుక ద్వారా మెసేజ్‌ పాస్‌ చేసినట్టనిపించింది. పవన్‌ని అభిమానించే నితిన్‌కే పవన్‌ అభిమానులు ఫుల్‌ సపోర్ట్‌ ఇస్తుంటారు. అలాంటిది పవన్‌ అభిమానించే చరణ్‌ని ఓన్‌ చేసుకోరా? రంగస్థలంకి సంబంధించి చరణ్‌కి చాలా ప్రశంసలు, అభినందనలు లభించి వుండొచ్చు. కానీ వాటన్నిటినీ మరిపించే విధంగా బాబాయ్‌ తనకో మర్చిపోలేని సాయంత్రాన్నిచ్చాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు