రంగస్థలం రికార్డు మూడ్రోజుల్లో బద్దలు

రంగస్థలం రికార్డు మూడ్రోజుల్లో బద్దలు

రంగస్థలం చిత్రంతో యుఎస్‌లో నాన్‌ బాహుబలి రికార్డుని చరణ్‌ నెలకొల్పిన సంగతి తెలిసిందే. మూడేళ్లుగా బ్రేక్‌ అవని 'శ్రీమంతుడు' రికార్డుని రంగస్థలం బీట్‌ చేసింది. ఓవరాల్‌గా మూడున్నర మిలియన్ల గ్రాస్‌ సాధించే దిశగా రంగస్థలం దూసుకుపోతోంది. అయితే ఈ రికార్డుని మూడే రోజుల్లో బీట్‌ చేసి కొత్త నాన్‌బాహుబలి రికార్డు నెలకొల్పడానికి 'భరత్‌ అనే  నేను' బయ్యర్లు పాన్‌ చేస్తున్నారు. ఈ చిత్రానికి వున్న క్రేజ్‌ని ఫుల్‌గా క్యాష్‌ చేసుకునే విధంగా, ప్రీమియర్స్‌ నుంచే రెండు మిలియన్లు రాబట్టేలా గ్రేట్‌ ఇండియా ఫిలింస్‌ పకడ్బందీ ప్రణాళిక వేసుకుంది.

రెండు వేల ప్రీమియర్లని మూడు వందలకి పైగా లొకేషన్లలో ప్లాన్‌ చేస్తున్నారు. మొదటి వారాంతంలో పది వేలకి పైగా షోస్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఏమాత్రం బాగుందనే టాక్‌ వచ్చినా కానీ మహేష్‌కి యుఎస్‌ మార్కెట్లో వున్న క్రేజ్‌తో తొలి వారాంతంలోనే మూడున్నర మిలియన్లు వసూలవడం ఖాయం చేసుకోవచ్చు. సినిమా కనుక శ్రీమంతుడు మాదిరిగా బ్లాక్‌బస్టర్‌ టాక్‌ తెచ్చుకున్నట్టయితే అయిదు మిలియన్ల గ్రాస్‌ వసూలు చేసినా ఆశ్చర్యం లేదు. గత రెండు చిత్రాలతో మహేష్‌ నిరాశ పరచడంతో అభిమానులు ఆవురావురుమంటూ వున్నారు. సినిమాపై ఎటునుంచి చూసినా సానుకూల పవనాలే వీస్తున్నాయి. ఆడియో ఇప్పటికే బ్రహ్మాండమైన హిట్టు కాగా, ఈ చిత్రానికి సంబంధించిన ప్రోమోస్‌, పోస్టర్స్‌ అన్నీ మరింతగా ఆకర్షిస్తూ హైప్‌ పెంచేస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English