నాని బలహీనతలు బయటపడుతున్నాయ్‌!

నాని బలహీనతలు బయటపడుతున్నాయ్‌!

వరుస విజయాల్లో దూసుకుపోతున్న నాని ఈమధ్య మాస్‌ హీరోగా ఎదిగేందుకు కాన్షియస్‌ ఎఫర్ట్స్‌ పెడుతున్నాడు. ఎంసిఏలో కనిపించిన ఆ ఛాయలు 'కృష్ణార్జున యుద్ధం'లో తీవ్రంగా కనిపించాయి. మాస్‌ ఆడియన్స్‌ కోసమే తీసినట్టుగా యాక్షన్‌తో కూడిన ద్వితియార్థం నాని రెగ్యులర్‌ ఆడియన్స్‌ని నిరాశ పరిచింది. ఈ చిత్రానికి తొలి రోజే చెప్పుకోతగ్గ టాక్‌ రాలేదు. విడుదలకి ముందు సరయిన బజ్‌ లేకపోవడంతో ఓపెనింగ్‌ కూడా సాధారణంగానే వచ్చింది. ఎంసిఏ ఆరంభ వసూళ్లతో పోలిస్తే ఇవి అరవై శాతమే వున్నాయని ట్రేడ్‌ చెబుతోంది. ఇదిలావుంటే రెండు రోజుల్లోనే ఈ చిత్రంపై బజ్‌ పూర్తిగా పోయింది. సినిమా బాలేదనే టాక్‌ బాగా స్ప్రెడ్‌ అవడంతో బాక్సాఫీస్‌ వద్ద అసలు ప్రభావం చూపించలేకపోతోంది.

ఇటీవలి కాలంలో నాని సినిమాలు టాక్‌కి అతీతంగా యుఎస్‌ బాక్సాఫీస్‌ దగ్గర మంచి వసూళ్లు సాధిస్తూ వచ్చాయి. కానీ ఈసారి అక్కడ కూడా బిజినెస్‌ చాలా డల్‌గా వుంది. వరుసగా మిలియన్‌ డాలర్లు వసూలవుతున్నాయని ఈ చిత్రాన్ని కాస్త ఎక్కువ మొత్తం ఇచ్చి కొన్న బయ్యర్‌కి ఈసారి నష్టం తప్పదట. మినిమం గ్యారెంటీ హీరో అనిపించుకుంటోన్న దశలో నాని తన బలాలని విడిచి పెట్టి మాస్‌ జోన్‌లోకి చొరబడాలని చూడడంతో బాక్సాఫీస్‌ పరంగా తన బలహీనతలు బయట పడుతున్నాయి. ఈ అనుభవంతో అయినా తన తదుపరి చిత్రాల ఎంపికలో నాని జాగ్రత్తలు పడతాడా లేదా అనేది చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English