వేస్ట్ అన్నారు.. 200 కోట్లు కొల్లగొట్టింది

వేస్ట్ అన్నారు.. 200 కోట్లు కొల్లగొట్టింది

కొన్ని సినిమాలు రివ్యూలు.. టాక్‌తో సంబంధం లేకుండా దుమ్ము దులిపేస్తుంటాయి. బాలీవుడ్లో తరచుగా సల్మాన్ ఖాన్ సినిమాల విషయంలో ఇలా జరుగుతుంటుంది. ఈ కోవలోనే టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన ‘బాఘి-2’ కూడా సమీక్షకులకు షాకిస్తూ సంచలన వసూళ్లు సాధించింది. ఈ చిత్రానికి 1.5-2 మధ్య రేటింగ్స్ ఇచ్చారు క్రిటిక్స్. ‘క్షణం’కు రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రం.. తెలుగు వెర్షన్‌కు పూర్తి భిన్నంగా కనిపించింది. ‘క్షణం’ లాంటి మంచి సినిమాను కిచిడీ చేసేశారని.. కేవలం యాక్షన్ తప్ప ఇందులో మరేమీ లేదని అన్నారు క్రిటిక్స్. సోషల్ మీడియాలో కూడా దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ అవేవీ సినిమా వసూళ్లపై ప్రభావం చూపలేకపోయాయి.

మార్చి 29న విడుదలైన బాఘి-2 ఏకంగా రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇండియాలో రూ.149 కోట్ల దాకా వసూళ్లు రాగా.. విదేశీ వసూళ్లు రూ.51 కోట్లకు పైనే ఉన్నాయి. మొత్తంగా రూ.200 కోట్ల క్లబ్బులోకి చేరి ఆశ్చర్యపరిచిందీ చిత్రం. ఈ ఏడాది ‘పద్మావత్’ తర్వాత ఆ క్లబ్బులోకి చేరిన సినిమా ఇదే. మామూలుగా ఖాన్ త్రయం సినిమాలు మాత్రమే ఈ స్థాయిలో వసూళ్లు రాబడుతుంటాయి. అక్షయ్ కుమార్.. హృతిక్ రోషన్‌ల సినిమాలకు సైతం ఈ స్థాయి వసూళ్లు రావు. అలాంటిది నాలుగు సినిమాల అనుభవమున్న టైగర్ ష్రాఫ్ సినిమా ఇంత పెద్ద విజయం సాధించడం అనూహ్యమే. అది కూడా డివైడ్‌ టాక్‌ను తట్టుకుని ఈ చిత్రం ఇంత వసూళ్లు రాబట్టడం అసాధారణం. టైగర్ సరసన దిశా పటాని నటించిన ఈ చిత్రాన్ని సాజిద్ నడియాడ్‌వాల నిర్మాణంలో అహ్మద్ ఖాన్ రూపొందించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English