అక్కినేని సమంత.. ఆదివారం సెంటిమెంటు

అక్కినేని సమంత.. ఆదివారం సెంటిమెంటు

అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకోవడం అలస్యం.. తన పేరు వెనుక ఉన్న ‘రూత్ ప్రభు’ను తీసేసి.. ముందు ‘అక్కినేని’ని జోడించింది సమంత. ఆ కుటుంబంలోకి వెళ్లాక తన అలవాట్లు కూడా మారిపోతున్నాయని అంటోంది సామ్. ఇంతకుముందు ఆదివారాలు కూడా అవసరమైతే షూటింగుల్లో పాల్గొనేదట సమంత. కానీ ఇప్పుడు ఆదివారం స్ట్రిక్టుగా షూటింగులకు దూరంగా ఉంటోందట. ఇందుకు అక్కినేని వారి ‘ఆదివారం’ సెంటిమెంటే కారణమని ఆమె చెప్పింది. అక్కినేని నాగేశ్వరరావు ఆదివారం ఎట్టి పరిస్థితుల్లోనూ షూటింగులకు వెళ్లేవారు కాదు. అదే సంప్రదాయాన్ని నాగ్ తదితరులు కూడా కొనసాగిస్తున్నారు. తాను అక్కినేని కోడలయ్యాక ఆ ఆనవాయితీని కొనసాగిస్తున్నానని సమంత ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

ఇక పెళ్లయ్యాక కూడా తీరిక లేకుండా సినిమాలు చేస్తున్నారు.. ఈ విషయంలో చైతూ నుంచి కంప్లైంట్లేమీ లేవా అని సమంతను అడిగితే.. ఎందుకు లేవని ప్రశ్నించింది. పెళ్లయ్యాక తామిద్దరం హనీమూన్‌కు కూడా వెళ్లలేదని.. ఎట్టకేలకు ఈ మధ్యే అమెరికాకు వెళ్లామని.. అది కూడా ‘రంగస్థలం’ విడుదలకు ముందున్న ఒత్తిడిని దూరం చేసుకోవడానికే అని.. తన కొత్త సినిమా ఏది విడుదలవుతున్నా తాను ప్రెజర్ ఫీలవుతుంటానని.. దాన్ని తగ్గించుకోవడానికే చైతూతో కలిసి టూర్ వేశానని ఆమె చెప్పింది. పెళ్లయ్యాక హీరోయిన్లకు అవకాశాలు తగ్గిపోవడం గురించి సమంత స్పందిస్తూ.. ఒక కథానాయికకు పెళ్లయిపోయింది కాబట్టి సినిమాలు చూడకూడదని ఏ ప్రేక్షకుడూ అనుకోడని.. అలాంటపుడు దర్శక నిర్మాతలు మాత్రం ఎందుకు వాళ్లకు అవకాశాలు తగ్గించేస్తారో అర్థం కాదని.. తన విషయంలో ఆ ఆలోచన మారుతోందని సమంత చెప్పింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు