సీకట్లో పవన్ అద్దాలు ఎట్టాడేటబ్బా?

సీకట్లో పవన్ అద్దాలు ఎట్టాడేటబ్బా?

పవన్ కళ్యాణ్ టాలీవుడ్ కి చాలా స్టైల్స్ నేర్పాడు. హెయిర్ స్టైల్ నుంచి డ్రెసింగ్ వరకూ పవన్ తన 25 సినిమాల కెరీర్ లో చూపించిన స్టైల్స్ చాలానే ఉన్నాయి. ఇపుడు రంగస్థలం సక్సెస్ ఈవెంట్ కు అందరూ డ్రెస్ కోడ్ మాదిరిగా తెల్ల లుంగీలతో రావడంతో.. తను కూడా అలాగే వైట్ అండ్ వైట్ లో వచ్చాడు పవర్ స్టార్. అయితే.. ఓ నల్ల కళ్లద్దాల జోడును మాత్రం ధరించే ఉన్నాడు పవన్. ఏ సమయంలోనూ కళ్లజోడు తీసేందుకు ప్రయత్నించలేదు.

ఫోటోలకు కూడా అలాగే పోజులు ఇచ్చాడు. స్టేజ్ కింద కూర్చునప్పుడు.. పైకెక్కి మాట్లాడుతున్నపుడు.. అన్నిసార్లు కళ్లజోడుతోనే కనిపించాడు. ఇలా తను కళ్లజోడును ధరించడం స్టైలింగ్ కోసం కాదంటూ తనే చెప్పుకొచ్చాడు పవర్ స్టార్. ప్రస్తుతం తన కళ్లకు ఓ ఇబ్బంది ఉందని.. లైటింగ్ కళ్ల మీద పడకుండా ఉండేందుకే ఇలా కళ్లజోడు పెట్టుకున్నాను తప్ప స్టైల్ స్టేట్మెంట్ కోసం కాదంటూ చెప్పి.. నవ్వులు పూయించాడు పవర్ స్టార్. అంతకంటే ముందు ఇదే కళ్ళజోడు గురించి చరణ్‌ కు కూడా స్టేజీ కింద ఏదో చెప్పడం చూస్తే.. తన కళ్ళకు ఏదో అవుతోందని చెబుతున్నట్లు అర్దమైందిలే.

ఇక రంగస్థలం సక్సెస్ మీట్ ఈవెంట్ మొత్తం పవన్ సరదా సరదాగా గడిపాడు. తను నవ్వుతూనే ఉన్నాడు.. పక్కనున్నవారితో నవ్వులు పూయిస్తూనే ఉన్నాడు. బ్రహ్మాజీపై కేక్ విసరడం లాంటి కొంటె పనులు కూడా పవన్ కళ్యాణ్ చేయడం కనిపించింది. పవన్ ను ఇంత సరదాగా చూసి.. అభిమానులు అయితే మరీ హ్యాపీ అయిపోయారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు