డ్రెస్ కోడ్ బాగుందమ్మా రంగస్థలం బ్యాచ్

డ్రెస్ కోడ్ బాగుందమ్మా రంగస్థలం బ్యాచ్

రంగస్థలం మూవీ సాధించిన సక్సెస్ సామాన్యమైనది కాదు. ఒక కాన్సెప్ట్ బేస్డ్ ఎక్స్ పెరిమెంటల్ పీరియాడిక్ మూవీని.. స్టార్ హీరోతో చేసి.. దాన్ని కమర్షియల్ సక్సెస్ గా నిలిపి.. ఇండస్ట్రీ హిట్ స్థాయికి చేర్చడం చిన్న విషయం కాదు. అంతటి ఘన విజయం సాధించిన ఈ చిత్రానికి సక్సెస్ మీట్ ను కూడా అంతే గ్రాండ్ గా నిర్వహించారు.

అయితే.. ఇప్పటివరకూ టాలీవుడ్ లో ఏ సినిమా ఫంక్షన్ లోను కనిపించని మాదిరిగా.. ఓ డ్రెస్ కోడ్ ను విధించడం.. దాన్ని అందరూ పాటించడం మాత్రం సూపర్బ్ గా ఉంది. రంగస్థలం సక్సెస్ మీట్ కు.. అందరూ తెల్ల లుంగీలు ధరించి మాత్రమే వచ్చి.. తెలుగుదనం ఉట్టిపడేటట్లు చేశారు. చీఫ్ గెస్ట్ పవన్ కళ్యాణ్.. హీరో రామ్ చరణ్.. దర్శకుడు సుకుమార్.. ఇలా ప్రతీ ఒక్కరూ తెల్ల లుంగీలోనే కనిపించడం విశేషం. కేవలం ఈవెంట్ కు ఇలా అటెండ్ కావడం మాత్రమే కాదు.. 'జిల్ జిల్ జిగేలు రాణి' పాటకు కూడా దాదాపు యూనిట్ సభ్యులు అందరూ కలిసి.. ఆ లుంగీల్లోనే స్టెప్పులు వేయడం మరీ ఆకట్టుకుంది.

రంగస్థలం సక్సెస్ మీట్ కు వచ్చిన అభిమానుల్లో కూడా చాలావరకు ఈ డ్రెస్ కోడ్ ను పాటించి.. చిట్టిబాబుపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈవెంట్ చివరలో చిట్టిబాబు నా చిన్న తమ్ముడు అంటూ పవన్ నోటి నుంచి వచ్చినపుడు చూడాలీ.. ఫ్యాన్స్ అనందం అవధులు దాటిపోయిందంతే.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు