మీడియాకి పవన్-చెర్రీ స్వీట్ పంచ్ లు

మీడియాకి పవన్-చెర్రీ స్వీట్ పంచ్ లు

వేల మంది జనాల ముందు స్టేజ్ పై మాట్లాడడం అంటే అంతో ఇంతో మనసులో కాస్త బెరుకు మొదలవుతుంది. ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడని రామ్ చరణ్ పరిస్థితి కూడా.. రంగస్థలం సక్సెస్ ఈవెంట్ లో ఇలాగే మారిపోయింది. ఎదురుగుండా తన బాబాయ్ పవన్ కళ్యాణ్ కనిపించడంతో.. ఉత్సాహం- ఆనందం ఎక్కువైపోయి కాసింత కంగారుగానే కనిపించాడు. కానీ కవర్ చేశాడు లెండి.

అయితే.. తన స్పీచ్ అంతా అయిపోయాక.. చివరలో అందరికీ థ్యాంక్స్ చెబుతూ.. టీవీ9 చౌదరి గారికి కృతజ్ఞతలు అనేశాడు. కానీ ఎదురుగా పవన్ పక్కన కూర్చున్న వ్యక్తి ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి. తన తప్పు గ్రహించిన చెర్రీ.. సారీ టీవీ9 చౌదరి కాదు.. ఎన్టీవీ చౌదరి గారు.. అంటూ సర్ది చెప్పాడు. మైక్ తిరిగి యాంకర్ ఇచ్చేందుకు ముందు.. 'రేపు పొద్దున ఇదొక్కటే వేస్తారా ఏంటి' అంటూ నవ్వుతూ వెళ్లిపోయాడు చెర్రీ. నవ్వుతూనే అన్నా ఈ మాటలో బోలెడంత వ్యంగ్యం దాగి ఉంది. ఇవాల్టి రోజుల్లో మీడియాకి ఏదైనా పాయింట్ దొరికితే.. అదే విషయాన్ని ఒకటికి పదిసార్లు.. వందసార్లు చొప్పున జనాలకు విసుకు వచ్చే వరకూ టెలికాస్ట్ చేస్తూనే ఉండడం పైనే ఇలా స్వీట్ పంచ్ ఇచ్చాడు చెర్రీ.

ఇక పవన్ కళ్యాణ్ కూడా తన స్పీచ్ లో భాగంగా.. 'రామ్ చరణ్ చెప్పినట్లు ఈయన టీవీ9 చౌదరి కాదు.. ఎన్టీవీ చౌదరిగారు.. ఆయనకు.. అలాగే టీవీ9 రవిప్రకాష్ గారికి కృతజ్ఞతలు..' అంటూ ఇదే అంశాన్ని మరోసారి ప్రస్తావించాడు పవన్ కళ్యాణ్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు