నానికి యుద్ధం రిజల్ట్ ముందే తెలుసా?

నానికి యుద్ధం రిజల్ట్ ముందే తెలుసా?

సహజంగా తన సినిమా గురించి ప్రమోషన్స్ విషయంలో నాని చాలా అగ్రెసివ్ గా ఉంటాడు. ఒక వైపు ఓ చిత్రం షూటింగ్ చేసేస్తూనే.. మరోవైపు నెక్ట్స్ రిలీజ్ కానున్న మూవీకి ప్రమోషన్స్ చేస్తుంటాడు. కానీ కృష్ణార్జున యుద్ధం విషయంలో మాత్రం అంతగా నాని నుంచి యాక్టివిటీ కనిపించలేదు.

క్యారెక్టర్ గురించి.. కథ గురించి.. హీరోయిన్స్ గురించి.. దర్శకుడి గురించి.. ఇలా ఒక్కో పాయింట్ ను ఒక్కోసారి హైలైట్ చేస్తూ ప్రమోషన్స్ చేసే నాని.. కృష్ణార్జున యుద్ధం విషయంలో మాత్రం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొనడం.. ఒకట్రెండు ఇంటర్వ్యూలతో సరిపెట్టడం వంటివి చేశాడు. ఇప్పుడు సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. నాని సినిమాపై ఉన్న ఎక్స్ పెక్టేషన్స్ కు అనుగుణంగా ఏ మాత్రం పెర్ఫామ్ చేయడం లేదు. న్యాచురల్ స్టార్ గత చిత్రంతో పోల్చితే 60 శాతం మాత్రమే తొలిరోజు వసూళ్లు వచ్చాయి. టాక్ దెబ్బకు రెండో రోజు మరింతగా తగ్గిపోయాయనే అంచనాలు ఉన్నాయి.

కృష్ణార్జున యుద్ధం విషయంలో నాని తీరు చూస్తే.. ఈ చిత్రం రిజల్ట్ ను ముందే ఊహించేశాడా అనిపించక మానదు. అందుకే వీలైనంత సింపుల్ గా ప్రమోషన్స్ ను పూర్తి చేసేశాడు. ఇప్పుడు ఆఫ్టర్ రిలీజ్ ప్రచారం విషయంలో కూడా అస్సలు ఏమాత్రం యాక్టివిటీ చూపించడం లేదు. ఇది నానికి యుద్ధంలో గెలుపుపై నమ్మకం లేదనే సంగతి చెప్పకనే చెబుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English