ఏందిది సాహో.. నార్మల్ గానే ఉందే

ఏందిది సాహో.. నార్మల్ గానే ఉందే

బాహుబలి సిరీస్ కోసం నాలుగేళ్లకు పైగా సమయాన్ని కేటాయించిన తర్వాత ప్రభాస్ చేస్తున్న మూవీ సాహో. బాహుబలి2 విడుదల అయ్యి ఈ నెల 28తో ఏడాది గడిచిపోతుంది. ఇప్పటికీ సాహో షూటింగ్ పూర్తి కాలేదంటే.. ఈ చిత్రం కోసం కూడా సుదీర్ఘ సమయం కేటాయిస్తున్నారనే సంగతి అర్ధమైపోతోంది.

ఇప్పుడు ప్రభాస్ ఓ మూవీ చేస్తే అది కచ్చితంగా నేషనల్ ప్రాజెక్టు అయిపోతుంది. సాహో హిందీ వెర్షన్ రైట్స్ ను 120 కోట్లకు విక్రయించారనే టాక్ ఇప్పుడు సెన్సేషన్ అవుతోంది. ఇంతగా హైప్ ఉన్న సాహో కోసం.. ప్రభాస్ చాలానే కేర్ తీసుకుంటున్నాడని అన్నారు. తన లుక్ విషయంలో కూడా యంగ్ రెబల్ స్టార్ మార్పులు చేసుకున్నాడని.. కొత్తగా కనిపిస్తాడనే టాక్ వినిపించింది. కానీ తాజాగా ప్రభాస్ ఓ సినిమా ప్రమోషన్ కోసం.. ట్రైలర్ లాంఛింగ్ చేశాడు. ఈ సమయంలో కెమేరా కళ్లకు దొరికిపోయాడు.

ఈ పిక్స్ లో ప్రభాస్ లుక్ ఏ మాత్రం కొత్తగా లేదనే విషయం తెలిసిపోతోంది. బాహుబలి గెటప్ తో పోల్చితే జుట్టు కొంచెం తగ్గించుకున్నాడు. బాడీ కూడా బాగా తగ్గింది. అంతే తప్ప.. తన లుక్ విషయంలో చేసిన మార్పులు ఏమీ లేవు. సాహో కోసం కొత్త లుక్ అంటూ వినిపించిన మాటలు.. ఇప్పుడు కనిపిస్తున్న నార్మల్ లుక్ చూసిన తర్వాత.. అవాస్తవాలే అని తెలిసిపోతుంది. ఇక మీదట మార్చేస్తాడని అనేందుకు కూడా లేదు. ఎందుకంటే.. ప్రస్తుతం ఈ సినిమాకు అత్యంత కీలకమైన షెడ్యూల్ ను దుబాయ్ లో షూటింగ్ చేసేందుకు మూవీ యూనిట్ సిద్ధమైపోయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు