నాని.. ఫస్ట్ టైం ఫెయిలయ్యాడు

నాని.. ఫస్ట్ టైం ఫెయిలయ్యాడు

ఈ తరం యువ కథానాయకుల్లో నటుడిగా నానికి వచ్చినంత పేరు ఇంకెవరికీ రాలేదు. ఎలాంటి పాత్ర ఇచ్చినా సరే దాన్ని మరో మెట్టు ఎక్కిస్తాడని.. అతడి సినిమాలు ఫెయిలైతే కావచ్చని.. కానీ నటుడిగా మాత్రం నాని ఫెయిలయ్యే ఛాన్సే లేదని జనాల్లో బలమైన అభిప్రాయం ముద్ర పడిపోయింది. ‘జెంటిల్‌మన్’.. ‘నేను లోకల్’.. ‘ఎంసీఏ’ లాంటి సాధారణమైన సినిమాలు కూడా మంచి వసూళ్లే రాబట్టడానికి నానీనే కారణం అనడంలో సందేహం లేదు.

ఈ నేపథ్యంలో ‘కృష్ణార్జున యుద్ధం’ కూడా పక్కా హిట్ అన్న నమ్మకంతో ఉన్నారు అతడి అభిమానులు. కానీ ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది. ఆశ్చర్యకరంగా తొలి రోజు వసూళ్లు కూడా అంచనాలకు తగ్గట్లుగా లేవు. ‘ఎంసీఏ’కు కూడా ఇలాంటి టాకే వచ్చినప్పటికీ.. ఆ చిత్రానికి కళ్లు చెదిరే ఓపెనింగ్స్ వచ్చాయి.

వసూళ్ల సంగతి అలా ఉంచితే.. ఫస్ట్ టైం నటుడిగా నాని ఫెయిలయ్యాడనే కామెంట్లు ఈ సినిమా విషయంలోనే వినిపిస్తున్నాయి. ఐతే అతను పూర్తిగా ఫెయిలవ్వలేదు. సగం వరకే ఫెయిలయ్యాడు. ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే. కృష్ణగా.. అర్జున్‌గా భిన్నమైన పాత్రల్లో కనిపించాడు. ఐతే కృష్ణ పాత్రలో అదరగొట్టేసి ప్రశంసలు అందుకుంటున్న నాని.. అర్జున్‌గా మాత్రం తేలిపోయాడు. రాక్ స్టార్ పాత్రకు అతను ఏమాత్రం సూటవ్వలేదన్న అభిప్రాయం అందరిలోనూ కదిలింది. ఒక విగ్గు పెట్టి కొత్తగా కనిపించడానికి ట్రై చేశాడు కానీ.. అది పేలవంగా అనిపించింది.

ఇక పాత్రలో కూడా ఎలాంటి కొత్తదనం, వైవిధ్యం లేకపోవడంతో అది తేలిపోయింది. నాని తన నటనతో కూడా దాన్ని నిలబెట్టడానికి ప్రయత్నించలేదు. మొత్తంగా సినిమాలో అదొక వృథా పాత్రలా మిగిలిపోయింది. ఫస్ట్ టైం నాని తన లిమిటేషన్స్ చూపించిన సినిమా ఇది. మనలో ఒకడిగా.. పక్కింటి కుర్రాడిగా అయితే ఓకే కానీ.. రిచ్ కిడ్‌గా, రాక్ స్టార్‌గా అంటే మాత్రం నాని చెయ్యలేడన్న అభిప్రాయం ఈ సినిమా కలిగించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English