రానా బాబు.. ఆ ప్రశ్నలు ఎదురైతే?

రానా బాబు.. ఆ ప్రశ్నలు ఎదురైతే?

ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అంటే శ్రీరెడ్డి మాత్రమే అన్నట్లు తయారైంది వ్యవహారం. జనాలకు కొత్త సినిమా థియేటర్లలోకి వచ్చిన పాయింట్ కంటే.. శ్రీరెడ్డి లీక్స్ ఎక్కువ కిక్ ఇస్తున్నాయి. అసలు ఈ వ్యవహారానికి ఇంతగా ప్రచారం దక్కడానికి శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శన ఎంతగా కారణమో.. సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్ పేరు బైటకు రావడం కూడా అంతే కారణం.

ప్రస్తుతం అభిరామ్ అన్న సినీ హీరో అయిన దగ్గుబాటి రానా ఫుల్ బిజీగానే ఉన్నాడు. శ్రీరెడ్డి వ్యవహారాన్ని పట్టించుకోకుండా.. తను డబ్బింగ్ చెప్పిన హాలీవుడ్ మూవీ ప్రచార పనుల్లో ఉన్నాడు. అవెంజర్స్- ఇన్ఫినిటీ వార్ మూవీలో థనోస్ పాత్రకు తెలుగు డబ్బింగ్ చెప్పాడు రానా. అందుకే ఆ సినిమాకు తన వంతుగా ప్రచారం చేసుకుంటున్నాడు. ప్రొఫెషనల్ గా ఇది కరెక్టే అయినా.. ఇలాంటి సమయంలో మీడియాకు చిక్కితే సహజంగా వారి నుంచి వచ్చే ప్రశ్నలు వివాదానికి సంబంధించినవే కావడం కొత్తేమీ కాదు.

ఇప్పుడు శ్రీరెడ్డి గురించి కానీ.. అభిరామ్ తో దిగిన ఫోటోలను ఆమె బైట పెట్టడం గురించి కానీ.. రామానాయుడు స్టూడియోను బ్రోతల్ హౌస్ తో పోల్చి ఆమె చేసిన కామెంట్స్ గురించి కానీ.. ప్రశ్నలు ఎదురైతే అప్పుడు రానా ఎలా స్పందిస్తాడు అన్నదే ఆసక్తి కరం. అయితే.. ఇలాంటి సమయాల్లో ప్రెస్ మీట్స్ నిర్వహించేటపుడు.. సహజంగానే కొన్ని ప్రశ్నలు అడగకూడదు అనే కండిషన్ తోనే మీడియా మీట్స్ నిర్వహిస్తారు. సో.. అలా రానా ఈ ప్రశ్నల నుంచి ఎస్కేప్ అయిపోయే ఛాన్స్ ఒకటి ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు