మెహబూబా బాధ్యత నెత్తినేసుకుంది!!

మెహబూబా బాధ్యత నెత్తినేసుకుంది!!

ఓ సినిమాకు లైన్ ప్రొడ్యూసర్ గానో.. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గానో వ్యవహరించడం అంటే.. సహజంగా నిర్మాణంతో వారి వారి బాధ్యతలు పూర్తయిపోయాయని అనుకుంటాం. కానీ ఆకాష్ హీరోగా పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన మెహబూబా విషయంలో మాత్రం ఛార్మి దగ్గరుండి అన్ని బాధ్యతలు తీసుకుంటోంది.

మెహబూబాకు సంబంధించిన అన్ని పనుల్లోను ఛార్మి తెగ కష్టపడుతోంది. ఇప్పుడు సినిమా కంప్లీట్ అయిపోయింది. రిలీజ్ కి రెడీగా కూడా ఉంది. అందుకే ఇప్పుడు సినిమాను ప్రమోట్ చేయడానికి అన్ని రకాల టెక్నిక్స్ ను పాటించేస్తోంది ఛార్మి. నిన్నటికి నిన్న హైద్రాబాద్ లో ఐపీఎల్ మ్యాచ్ జరిగితే.. ఆ కార్యక్రమానికి వచ్చేసింది ఛార్మి. పైగా హీరో ఆకాష్.. హీరోయిన్ నేహా సెట్టితో పాటు మెహబూబా టీంకు చెందిన పలువురిని కూడా తీసుకువచ్చింది. మ్యాచ్ ఆద్యంతం తిలకించడంతో పాటు.. కేరింతలతో మెహబూబా టీం.. అక్కడి ప్రేక్షకులను బాగానే అట్రాక్ట్ చేశారు.

ఈ సినిమా ప్రమోషన్ విషయంలో ఏ చిన్న పాయింట్ ను మిస్ కాని ఛార్మి.. మెహబూబా టీషర్టులు వేయించి ప్రమోషన్లకు తీసుకు రావడం గమనించాలి. అలాగని అదేదో యూనిఫాం మాదిరిగా అందరికీ ఒకటే రకం షర్టులు అంటగట్టుకుండా.. పలు రంగుల టీ షర్టులపై మెహబూబా లోగో డిజైన్ చేయించి.. వాటిని మెహబూబా టీంతో ధరింప చేసిన తీరు ఆకట్టుకుంటోంది. పూరీ కనెక్ట్స్ విషయంలో ఇంతగా బాధ్యతలు తీసుకుంటున్న ఛార్మిని అభినందించాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English