ఇలాంటి సినిమాలో అలాంటి పాటా..?

ఇలాంటి సినిమాలో అలాంటి పాటా..?

ఒక సినిమా నడతను బట్టి అందులో కమర్షియల్ అంశాలు జొప్పించాల్సి ఉంటుంది. అన్ని సినిమాలకూ కమర్షియల్ హంగులు జోడించలేం. పాత పాటల్ని రీమిక్స్ చేసి పెట్టడం అయినా అంతే. అక్కినేని నాగచైతన్య కొత్త సినిమా ‘సవ్యసాచి’లో నిన్ను రోడ్డు మీద చూసినది లగాయత్తు (‘అల్లరి అల్లుడు’లోని పాట) పాటను రీమిక్స్ చేసి పెట్టబోతున్నట్లుగా వస్తున్న వార్తలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.

‘సవ్యసాచి’ అనేది ఒక విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న సినిమా. ఇందులో హీరో చేయి ఒకటి అతడి అదుపులో ఉండదు. అది అతడికి తెలియకుండానే క్రిమినల్ పనులు చేస్తుంది. దాన్ని విలన్ తన అదుపులో ఉంచుకుంటాడట. ఇలా చాలా ఆసక్తి రేపేలా ఉంది కథాంశం.

ఐతే ఇలాంటి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాల్లో పాటలు కూడా అందుకు తగ్గట్లే ఉండాలి. కథానుసారం వెళ్లిపోవాలి. అసలు పాటలు సాధ్యమైనంత తక్కువగా ఉంటే మరీ మంచిది. ఇలాంటి సినిమాల్లో అసలు కమర్షియల్ హంగుల కోసం ప్రయత్నిస్తే కథాంశం చెడిపోతుంది. పైగా ‘నిన్ను రోడ్డు మీద చూసినది లగాయత్తు’ తరహా పాటను రీమిక్స్ చేయడం అన్నది మంచి ఆలోచన అనిపించుకోదేమో. ఇలాంటి సినిమాల్లో అలాంటి సాంగ్స్ అంటే వినడానికే ఆడ్‌గా అనిపిస్తుంది. అయినా నాగచైతన్య మాస్ ఇమేజ్ తెచ్చుకోలేదు. అతను ఇలాంటి పాటలు చేస్తే జనాలేమీ ఊగిపోరు.

నిజానికి చైతూ ఎప్పుడూ బిల్డప్‌ల కోసం ప్రయత్నించే రకం కాదు. కథతో పాటు సాగిపోయే పాత్రలే ఎంచుకుంటుంటాడు. మరి అతనెందుకు ఇలాంటి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలో తండ్రి పాటను రీమిక్స్ చేయాలనుకుంటున్నాడో.. చందూ మొండేటి దీనికి ఎలా అంగీకరించాడో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English