రంగస్థలం కోసం చరణ్ ప్రిపేరే కాలేదట

రంగస్థలం కోసం చరణ్ ప్రిపేరే కాలేదట

‘రంగస్థలం’ సినిమాతో నటుడిగా ఎంతో ఎత్తుకు ఎదిగిపోయాడు రామ్ చరణ్. తన నట ప్రతిభ విషయంలో ఉన్న సందేహాలన్నింటికీ అతను తెరదించాడు. ఒక పాత్రను ఓ నటుడు ఓన్ చేసుకుంటే ఔట్ పుట్ ఎలా ఉంటుందనడానికి రామ్ చరణ్ రుజువుగా నిలిచాడు. ఇందులో ఎక్కడా చిన్న లోపం కూడా లేకుండా పర్ఫెక్టుగా చిట్టిబాబు పాత్రను పోషించి శభాష్ అనిపించుకున్నాడు రామ్ చరణ్. ఇది చూస్తే చరణ్ ఈ పాత్ర కోసం చాలా హోమ్ వర్క్ చేసి ఉంటాడని.. ప్రత్యేకంగా ప్రిపేర్ అయి ఉంటాడని అనుకుంటాం. కానీ అలాంటిదేమీ జరగలేదని అంటున్నాడు దర్శకుడు సుకుమార్.

చిట్టిబాబు పాత్ర కోసం రామ్ చరణ్ ఏ రకంగానూ ప్రిపేర్ కాలేదని.. అలా కావద్దని కూడా తాను ముందే చెప్పానని సుకుమార్ తెలిపాడు. ఈ పాత్ర కోసం చరణ్ ప్రిపేరైతే ప్రి నోషన్స్ తో సెట్ కు వస్తాడని.. తనకంటూ ఈ పాత్ర విషయంలో కొన్ని ఆలోచనలు ఉండటంతో వాటికి.. చరణ్ ఆలోచనలకు పొంతన కుదరక క్లాష్ వస్తుందేమో అనుకున్నానని.. అందుకే ఓపెన్ మైండ్‌తో వైట్ పేపర్ లాగా సెట్‌కు రావాలని తాను చరణ్‌కు చెప్పానని సుకుమార్ తెలిపాడు.

సెట్లో అప్పటికప్పుడు సన్నివేశాన్ని బట్టి.. అప్పుడొచ్చే రా ఎమోషన్లకు తగ్గట్టుగా చేసుకుపోవాలని అనుకున్నామని సుకుమార్ తెలిపాడు. ఐతే షూటింగ్ తొలి రోజు చిట్టిబాబు పాత్ర గురించి చరణ్‌కు తాను బాగా వివరించగలిగానని అనుకుంటున్నానని.. అతను కుడా పాత్రను బాగా అర్థం చేసుకుని అద్భుతంగా నటించాడని సుక్కు తెలిపాడు. సినిమాలో చాలా సన్నివేశాలు ఒక్క షాట్లోనే చేసేశాడని.. ఎప్పుడూ పల్లెటూర్లో పెరగని చరణ్ చిట్టిబాబు పాత్రను అంత బాగా చేయడం.. చెవిటివాడిగా హావభావాలు అంత చక్కగా పలికించడం ఆశ్చర్యం కలిగించిందని సుకుమార్ అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు