ఆలియాని చూసి హర్టయిన బన్నీ ఫ్యాన్స్

ఆలియాని చూసి హర్టయిన బన్నీ ఫ్యాన్స్

ఐపీఎల్ మ్యాచులు ఆరంభం నుంచే తెగ రంజుగా సాగుతున్నాయి. ప్రతీ సమ్మర్ కి మాదిరిగానే జనాలు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈసారి ఐపీఎల్ వ్యాఖ్యానాన్ని తెలుగులో కూడా చూసే అవకాశం కల్పించింది స్టార్ మా. ఈ గ్రూప్ నకు చెందిన మా మూవీస్ ఛానల్ లో రోజూ ఐపీఎల్ మ్యాచ్ లు లైవ్ వస్తున్నాయి. అది కూడా తెలుగులో రావడం విశేషం. ఎన్టీఆర్ తో యాడ్ ఇప్పించి మరీ తెలుగులో ఐపీఎల్ కామెంటరీ వినిపిస్తున్నారు.

అయితే.. ఐపీఎల్ మ్యాచుల్లో ప్లేయర్లు.. టీంలు ఎంతగా పోటీ పడతాయో.. ఈ సమయంలో యాడ్స్ కోసం కంపెనీలు కూడా అదే స్థాయిలో పోటీ పడతాయి. తెలుగులో వచ్చే మ్యాచ్ లకు.. ఫ్రూటీ యాడ్ కోసం అల్లు అర్జున్ యాడ్ ను ప్రసారం చేస్తున్నారు. కానీ చాలామందికి ఇంగ్లీష్ కామెంటరీ వచ్చే స్టార్ స్పోర్ట్స్ ఛానల్ లో చూసేందుకే ఉత్సాహం చూపుతున్నారు. ఇక్కడ అల్లు అర్జున్ ను చూద్దామని ఆశిస్తే.. వారికి ఆశాభంగం తప్పడం లేదు. ఇందుకు కారణం.. అక్కడ ఇదే యాడ్ లో బాలీవుడ్ భామ ఆలియా భట్ దర్శనం ఇస్తోంది.

దీంతో బన్నీ ఫ్యాన్స్ తెగ డిజప్పాయింట్ అయిపోతున్నారు. నిజానికి ఫ్రూటీకి నార్త్ ఇండియా వరకూ ఆలియా బ్రాండ్ అంబాసిడర్ అయితే.. సౌత్ ఇండియాకి మాత్రం బన్నీ ప్రచారకర్త. తమ తమ ఒప్పందాలు.. ప్రాధాన్యతల ప్రకారం స్టార్ గ్రూప్ యాడ్స్ టెలికాస్ట్ చేస్తోంది. ఈ విషయం తెలిసినా సరే.. బన్నీని ఇంగ్లీష్ ఛానల్ లో చూడలేకపోతున్నందుకు ఫ్యాన్స్ హర్ట్ అయిపోతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు