యావరేజ్ టాకొస్తే రంగస్థలానికి రాసిచ్చినట్లే

యావరేజ్ టాకొస్తే రంగస్థలానికి రాసిచ్చినట్లే

గత నెల 30వ తేదీన విడుదల అయిన రామ్ చరణ్ మూవీ రంగస్థలం బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రన్ కంటిన్యూ చేస్తూనే ఉంది. ఇప్పటికి రెండు వారాల రన్ పూర్తయినా.. రంగస్థలంకు బ్రేక్ పడలేదు. కరెక్టుగా చెప్పాలంటే రంగస్థలంకు బ్రేక్ వేయగల మూవీ ఏదీ రిలీజ్ కాలేదు. గత వారం వచ్చిన నితిన్ మూవీ ఛల్ మోహన్ రంగ.. ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది.

యావరేజ్ టాక్ వచ్చినా.. జనాలను థియేటర్లకు తెచ్చేందుకు ఇది సరిపోలేదు. ఈ వారం కృష్ణార్జున యుద్ధం అంటూ నాని సినిమా రిలీజ్ అయింది. ఈ మూవీ టాక్ విషయం కూడా కాస్త అటూఇటూగానే ఉంది. మూవీకి పర్ఫెక్ట్ టాక తెలియాలంటే రేపటివరకూ ఆగాల్సిందే. యావరేజ్ సినిమాలతో కూడా సక్సెస్ లు కొట్టడం నానికి అలవాటు అయింది. కానీ రంగస్థలం చూసిన కళ్లతో యావరేజ్ కంటెంట్ ను ఆదరించడం ఆడియన్స్ ను కూడా కాస్త కష్టమైన విషయమే. అందుకే కృష్ణార్జున యుద్ధం మూవీ కనుక యావరేజ్ టాక్ తెచ్చుకుంటే.. ఏప్రియల్ 20 వరకు రంగస్థలానికి రాసిచ్చినట్లే అయిపోతుంది.

ఇప్పటికే రంగస్థలం 100 కోట్ల షేర్ సాధించేందుకు అతి చేరువ అయిపోయింది. ఈ వీకెండ్ లో నాని సినిమా ఆకట్టుకోకపోతే మాత్రం.. రంగస్థలం రన్ కు మరో వారం దొరికినట్లు అవుతుంది. ఏప్రిల్ 20న మహేష్ బాబు మూవీ భరత్ అనే నేను చిత్రం గ్రాండ్ రిలీజ్ అవుతుంది.. ఎక్స్ పెక్టేషన్స్ కూడా ఉండడంతో.. అప్పటివరకూ రంగస్థలంకు ఢోకా ఉండకపోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English