లైవ్‌లో జుగుప్సాకరమైన విషయం చెప్పిన శ్రీరెడ్డి

లైవ్‌లో జుగుప్సాకరమైన విషయం చెప్పిన శ్రీరెడ్డి

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ శ్రీరెడ్డి వ్యవహారమే. మొన్నటిదాకా ఆమెను లైట్ తీసుకున్న వాళ్లు కూడా సురేష్ బాబు తనయుడు అభిరామ్‌తో కలిసి ఉన్న ఫొటోలను ఆమె షేర్ చేయడంతో వ్యవహారం తీవ్రతను అర్థం చేసుకుంటున్నారు. తాజాగా ఆమె స్టార్ రైటర్ కోన వెంకట్ కూడా తనను లైంగికంగా వేధించినట్లుగా ఆరోపణలు చేసింది.

ఒక అగ్ర దర్శకుడు తనతో చేసిన రొమాంటిక్ చాట్‌ను కూడా ఆమె బయట పెట్టింది. ‘మా’ కార్యాలయం దగ్గర అర్ధనగ్నంగా నిరసన ప్రదర్శన చేశాక ఆమెతో చర్చా కార్యక్రమాల విషయంలో కొంచెం వెనుకంజ వేసిన టీవీ ఛానెళ్లు మళ్లీ ఇప్పుడు ఆమెను స్టూడియోలకు ఆహ్వానించి రసవత్తర చర్చలు నడుపుతున్నాయి.

తాజాగా ఒక టీవీ ఛానెల్ చర్చలో అభిరామ్ గురించి శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. టీవీల ముందు పిల్లలెవరైనా ఉంటే పక్కకు వెళ్లాలని.. మహిళలు తనను మన్నించాలని చెప్పి మరీ ఆమె ఒక జుగుప్సాకరమైన విషయం చెప్పింది. అభిరామ్‌కు తాను బ్లో జాబ్ చేయాల్సి వచ్చిందనే విషయాన్ని చాలా పచ్చిగా.. నాటు భాషలో చెప్పింది శ్రీరెడ్డి. ఇలా చేయడం తనకేమైనా సరదానా అని ఆమె ప్రశ్నించింది. తనకు ఇష్టం లేకపోయినా అలాంటివన్నీ చేశానని అంది.

అభిరామ్‌తో కలిసి ఉన్న ఫొటోలు బయటపెడితే అందులో తాను చాలా హ్యాపీగా కనిపిస్తున్నానని.. మ్యూచువల్ అండర్ స్టాండింగ్‌తో తమ మధ్య సెక్స్ జరిగిందని అంటున్నారని.. కానీ అతను తనను వేధించినపుడు, బలవంతంగా సెక్స్ చేసినపుడు వాటిని వీడియో తీయడానికి ఎలా సాధ్యమవుతుందని.. తానేమైనా నెత్తిన కెమెరా పెట్టుకుని తిరుగుతుంటానా అని ఆమె ప్రశ్నించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు