శ్రీ లీక్స్‌: ఎవడి క్రియేటివిటీ వాడిది

శ్రీ లీక్స్‌: ఎవడి క్రియేటివిటీ వాడిది

శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలకి తోడు ఇప్పుడు ఫోటో ప్రూఫ్‌లు కూడా బయటకి రావడంతో ఆమె కోసం గంటల కొద్దీ సమయం వెచ్చిస్తోన్న మీడియాకి స్వరం లేచింది. ఇంతకాలం కేవలం గాలి మాటల్లా అనిపించిన దానికి కాస్త రిలయబులిటీ వచ్చే సరికి ఇక శ్రీరెడ్డి కోసం ఒక ఉద్యమం స్టార్ట్‌ చెయ్యాలన్నట్టుగా చాలా చర్చ జరుగుతోంది.

ఇదిలావుంటే ఆమె వద్ద మరింత మంది జాతకాలు వున్నాయంటూ పలువురు ప్రముఖుల పేర్లని ప్రస్తావిస్తూ వాట్సాప్‌ స్క్రీన్‌ షాట్లు సర్కులేట్‌ అవుతున్నాయి. ఫోటో ఆధారాలని నమ్మేసినట్టుగా ఈ వాట్సాప్‌ చాటింగ్‌ల స్క్రీన్‌ షాట్స్‌ని నమ్మడానికి లేదు. ఎందుకంటే వాట్సాప్‌ చాట్‌ని ఫేక్‌గా రూపొందించడానికి చాలా రకాల మార్గాలున్నాయి. కనుక అది ఎంత వరకు రైట్‌ అనేది తెలుసుకోకుండా వాళ్ల మీద బురద చల్లడం మానుకోవాలి. నిజంగానే శ్రీరెడ్డి వద్ద వీడియో, ఫోటో ఆధారాలున్నట్టయితే ఏదో ఒక నాడు ఆమె బయట పెడుతుందని తేలింది.

బహుశా ఆమెతో గతంలో సంబంధం వున్న వారికి దగ్గుబాటి అభిరామ్‌ ఫోటోలు బయటపెట్టడంతో వణుకు మొదలై వుంటుంది. దీనిని అదనుగా చూసుకుని సినిమా, మీడియా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఆమెతో సెక్స్‌ చాట్‌ లేదా సెక్సువల్‌ అడ్వాన్సెస్‌ చేసారంటూ చాలా తయారు చేసి సర్కులేట్‌ చేస్తున్నారు. అభిరామ్‌లా ఇంకా ఎలాంటి సెలబ్‌ స్టేటస్‌ లేని యువకులు ఇలాంటివాటిపై ముందుచూపుతో వ్యవహరించరు కానీ ప్రముఖులకి ఎక్కడేం మాట్లాడాలో, ఎలా డీల్‌ చేయాలో తెలియకుండా వుండదుగా?

ఏదో ఒక రెండు ఫోటోలు బయటకి వచ్చాయని ఇక ఆమె ఏమి చెప్పినా దానికి తానా అంటే తందానా అనడం మానేయాలి. శేఖర్‌ కమ్ముల, నానిపై ఆమె చేసిన అసత్య ఆరోపణలు తెలియనివి కావు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు