త్రివిక్రమ్‌తో మహేష్‌ డ్రాప్‌ అయినట్టే!

త్రివిక్రమ్‌తో మహేష్‌ డ్రాప్‌ అయినట్టే!

మహేష్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో మరో సినిమా వస్తుందని చాలా కాలంగా వినిపిస్తోంది. అయితే ఇద్దరూ వేర్వేరు ప్రాజెక్టులతో బిజీగా వుండడంతో ఖలేజా తర్వాత మళ్లీ ఇద్దరూ కలిసి పని చేయలేదు. అయితే మహేష్‌ 26వ చిత్రం మాత్రం త్రివిక్రమ్‌తోనే అని ప్రచారం జరిగింది. మైత్రి మూవీ మేకర్స్‌ ఈ ఇద్దరి కలయికలో సినిమా చేద్దామని ప్లాన్‌ చేసుకున్నారు.

అయితే ఇప్పుడా సంస్థ ఆలోచన మారిందని, అజ్ఞాతవాసి ఫలితం చూసిన తర్వాత త్రివిక్రమ్‌తో సినిమాకి అంత క్రేజ్‌ వుండకపోవచ్చునని వేరే దర్శకుడి కోసం చూస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. రంగస్థలంతో సుకుమార్‌తో మంచి ర్యాపో కుదిరింది కనుక అతడితోనే ఈ ప్రాజెక్ట్‌ చేయాలనే ఆలోచనలో మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థ వుందని టాక్‌ వుంది. ఇంకా సుకుమార్‌ కానీ, మహేష్‌ కానీ దీనిపై ఒక మాట అనుకోలేదు కానీ '1 నేనొక్కడినే' ఫ్లాప్‌ అయినపుడు త్వరలోనే మహేష్‌తో మరో సినిమా చేసి మంచి విజయాన్ని అందిస్తానని మాటిచ్చాడు.

రంగస్థలం ఇంటర్వ్యూల్లో కూడా మహేష్‌తో సినిమా చేయాలని, అది తన బాధ్యత అని, సరైన సబ్జెక్ట్‌ కోసం చూస్తున్నానని చెప్పాడు. ఒకవేళ మహేష్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో సినిమా ఓకే అయినా కానీ అది సెట్స్‌ మీదకి వెళ్లడానికి చాలా సమయం పడుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English