హీరోయిన్లకు ఇలా కూడా రిక్వెస్ట్ పెడతారా?

హీరోయిన్లకు ఇలా కూడా రిక్వెస్ట్ పెడతారా?

సోషల్ మీడియా వచ్చాక సినీ తారలతో ముచ్చటించేందుకు.. వాళ్లపై తమ అభిమానాన్ని చాటేందుకు.. ఏదైనా సాయం అడిగేందుకు అభిమానులకు మంచి అవకాశం లభించింది. సోషల్ మీడియాలో మెసేజులు చూసి సెలబ్రెటీలు కొందరు స్పందిస్తున్నారు కూడా. ఐతే దీన్ని అడ్వాంటేజీగా తీసుకుని కొంచెం అతి చేసే అభిమానులు కూడా లేకపోలేదు. టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ మెహ్రీన్ పిర్జాదాను ఉద్దేశించి ఒక వ్యక్తి పెట్టిన మెసేజ్ చూస్తే ఆశ్చర్యం కలగక మానదు.

ఫేస్ బుక్‌లో వెంకట్ వెంకీ అనే పేరుతో ఉన్న ఒక వ్యక్తి మెహ్రీన్‌కు హాయ్ చెప్పి... ఆమెను తానెంతగానో ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. తనకు ఒక సాయం చేయమని అడుగుతూ.. తన అకౌంటుకి డబ్బులు పంపమన్నాడు. తన పేరు.. అకౌంట్ నంబర్.. బ్యాంక్ ఐఎఫ్ఎస్‌సీ కోడ్.. ఇలా పూర్తి వివరాలు ఇచ్చేశాడు. అంతే కాదు.. సాయం చేయబోతున్నందుకు థ్యాంక్స్ చెప్పి.. ఆమె డబ్బుల కోసం వెయిట్ చేస్తున్నట్లుగా కూడా పేర్కొన్నాడు.

కనీసం తన సమస్య ఏంటో కూడా చెప్పకుండా నేరుగా అకౌంట్ నంబర్ ఇచ్చి ఒక హీరోయిన్ని డబ్బులు పంపమని అడగడంలో ఆంతర్యం ఏమనుకోవాలి? జనాలు మరీ ఇంత చిత్రంగా ఉంటారా అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటివన్నీ పట్టించుకుంటే కష్టం కాబట్టే మెహ్రీన్ ఈ మెసేజ్‌కు రిప్లై కూడా ఇవ్వకుండా తన పనిలో తాను పడిపోయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English