ఇదేం ప్రభంజనం సామీ...

ఇదేం ప్రభంజనం సామీ...

ప్రేక్షకులు ఆకలితో ఉన్నపుడు ఓ మోస్తరు సినిమా పడినా చాలు.. అది ఎక్కడికో వెళ్లిపోతుంది. ‘రంగస్థలం’ పరిస్థితి అలాగే ఉంది మరి. కొత్త ఏడాదిలో సరైన పెద్ద సినిమా లేక జనాలు అసంతృప్తితో ఉన్న సమయంలో.. అది కూడా సమ్మర్ సీజన్ మొదలవుతుండగా థియేటర్లలోకి దిగిందీ సినిమా. దీంతో ప్రేక్షకులు కరువు తీరా ఈ సినిమా చూసేస్తున్నారు. రెగ్యులర్ మూవీ బఫ్స్ మాత్రమే కాదు.. ఫ్యామిలీస్ పెద్ద ఎత్తున ఈ సినిమాకు తరలి వస్తున్నాయి. దీంతో రెండో వారంలో కూడా ఈ చిత్రం కళ్లు చెదిరే వసూళ్లతో సాగిపోతోంది. ఏ కొత్త సినిమా అయినా.. పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా సరే.. రెండో వీకెండ్ తర్వాత వీక్ అయిపోతుంది. రెండో సోమవారం చాలా నామమాత్రంగా ఉంటాయి వసూళ్లు.

కానీ ‘రంగస్థలం’ మాత్రం రెండో సోమవారం కూడా తెలుగు రాష్ట్రాల్లో రూ.2 కోట్ల షేర్ సాధించి ఆశ్చర్యపరిచింది. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ‘రంగస్థలం’ ఆడుతున్న థియేటర్లు వీక్ డేస్‌లోనూ ఫుల్స్‌తో నడుస్తున్నాయి. ఇంకా మేజర్ సిటీలన్నింట్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గత వారాంతంలో వచ్చిన ‘చల్ మోహన్ రంగ’ పెద్దగా ప్రభావం చూపించకపోవడంతో ప్రేక్షకులకు ‘రంగస్థలం’ సినిమానే ఛాయిస్ అవుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులకూ నచ్చేలా తెరకెక్కడం.. క్లీన్ ఎంటర్టైనర్ కావడం దీనికి కలిసొచ్చే అంశం. దీంతో చిత్ర బృందం కూడా ఊహించని స్థాయిలో ఈ చిత్రం తిరుగులేని విజయం సాధించింది. ఈ చిత్ర వరల్డ్ వైడ్ షేర్ రూ.100 కోట్లకు చేరువగా ఉండటం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు