బన్నీ కూడా అదే తప్పు చేస్తాడా?

బన్నీ కూడా అదే తప్పు చేస్తాడా?

మెగా హీరోలందరూ దాదాపు ఒక టైములో ఒకే తప్పు చేస్తున్నారని అనిపిస్తోంది. గతంలో పవన్‌ కళ్యాణ్‌, ఆ తరువాత చరణ్‌, ఇప్పుడు అల్లు అర్జున్‌. అందరూ ఒకేలా థింక్‌ చేస్తూ కెరియర్‌లో కాస్త ప్రాబ్లమ్స్‌ క్రియేట్‌ చేసుకుంటున్నారు. ఇదివరలో పవన్‌ కళ్యాణ్‌ స్క్రిప్టులో బాగా తలపెట్టేసి, ఒక విధంగా సినిమాలు లేటవ్వడానికి కారకుడయ్యేవాడట.

ఆ తరువాత చరణ్‌ కూడా క్రియేటివ్‌ విషయాల్లో వేలుపెట్టేసి మగధీరకు ముందు, ఆ తరువాత సినిమాలను లేటుగానే అందించాడు. ఇక ఇప్పుడు బన్నీ కూడా, ఇద్దరమ్మాయిలతో సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌లో వేలు పెట్టడమే  కాకుండా, సురేందర్‌ రెడ్డితో చెయ్యనున్న రేసుగుర్రం సినిమా కథను ఇంతవరకు ఓకె చెయ్యలేదు.

అది మార్చండీ, ఇది మార్చండీ అంటూ బాగా విసిగిస్తున్నాడని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ లెక్కన చేసుకుంటే పోతే మనోడికి ఒకే సంవత్సరంలో రెండు సినిమాలు చెయ్యడం ఎక్కడ కుదురుతుంది? ఒక్కసారి ఈ విషయాన్ని అల్లు బాబు సరిచూసుకుంటే బెటర్‌!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు