చరణ్‌ సినిమాలో జబర్దస్త్‌ ఐటెమ్‌

చరణ్‌ సినిమాలో జబర్దస్త్‌ ఐటెమ్‌

జంజీర్‌ సినిమా విడుదల చేయడానికి వీల్లేదంటూ సుప్రీమ్‌ కోర్టు ఆజ్ఞ ఇచ్చిన సంగతి తెలిసిందే. లీగల్‌గా ఉన్న లొసుగులు తొలగే వరకు ఈ చిత్రం విడుదల ఎప్పుడనేది డౌట్‌గానే ఉంది. అయితే ఈ చిత్రం పబ్లిసిటీ కార్యక్రమాలు నిలిచిపోయినా కానీ షూటింగ్‌ అయితే సజావుగా సాగిపోతోంది. బ్యాలెన్స్‌ ఉన్న ఐటెమ్‌ సాంగ్‌ని ప్రియాంక చోప్రాపై చిత్రీకరిస్తున్నారు. గణేష్‌ ఆచార్య నృత్య దర్శకత్వంలో 'పింకీ' అనే ఐటెమ్‌ సాంగ్‌ ప్రియాంకపై తీస్తున్నారు. 

షీలా.. మున్నీ... ఛమేలీ.. తదితర పాటల్లా పింకీ కూడా ఐటెమ్‌ సాంగ్స్‌లో అల్టిమేట్‌ హిట్‌గా నిలిచిపోతుందని, ఈ పాటతోనే సినిమాకి క్రేజ్‌ రెండింతలు అవుతుందని దర్శకుడు అపూర్వ లఖియా అంటున్నాడు. సమ్మర్‌లోనే విడుదల చేద్దామని అనుకున్న ఈ చిత్రాన్ని ఇప్పుడు ఆగస్టులో విడుదల చేసేందుకు చూస్తున్నారని తెలిసింది. ఒక్కసారి కోర్టు క్లియరెన్స్‌ వచ్చిన తర్వాత పబ్లిసిటీ రెండు నెలల పాటు తీవ్రంగా చేస్తారట. ఆ తర్వాతే సినిమాని విడుదల చేస్తారట. ఈలోగా చరణ్‌ నటించిన ఎవడు సినిమా విడుదల చేయాలని చూస్తున్నారు.

 

TAGS