'డౌట్‌ లేదు.. ష్యూర్‌ షాట్‌ హిట్‌'

'డౌట్‌ లేదు.. ష్యూర్‌ షాట్‌ హిట్‌'

'రంగస్థలం' ఇంకా బ్రహ్మాండంగా ఆడుతూ వుండగా, మరో వారం రోజుల్లో 'భరత్‌ అనే నేను' రిలీజ్‌కి సిద్ధంగా వుండగా వస్తోన్న నాని సినిమా 'కృష్ణార్జున యుద్ధం' ఏ విధంగా ఫేర్‌ చేస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న నానికి ఈ చిత్రం ఓ విధంగా పరీక్ష కానుంది. ఇంతకాలం స్టార్‌ హీరోల సినిమాలకి దూరంగా తన సినిమాలు వచ్చేవి. కానీ ఇప్పుడు భారీ సినిమాలతో పోటీ పడుతోంది కనుక నాని తన ఫామ్‌ కొనసాగించగలడా లేదా అనేది చాలా మందికి వున్న సందేహం.

అయితే నాని మాత్రం ఈ చిత్రం ష్యూర్‌ షాట్‌ హిట్‌ అని చెబుతున్నాడు. ఈ చిత్రం చూసి ఎంజాయ్‌ చేయని వారు వుండరని, ప్రేక్షకులకి ఏమి కావాలో ఆ అంశాలన్నిటినీ దర్శకుడు మేర్లపాక గాంధీ పొందుపరిచాడని, కనుక వేరే సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా ఈ చిత్రానికి ఆదరణ వుంటుందని నాని చెబుతున్నాడు.

తన మాట మీద నమ్మకం వుంచి సినిమా చూడకుండానే డిస్ట్రిబ్యూషన్‌ రైట్స్‌ దిల్‌ రాజు తీసేసుకున్నాడని, ఇప్పుడు సినిమా చూసాక ఆయన కూడా దీని గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నాడని నాని అన్నాడు. ద్విపాత్రాభినయం గతంలో కూడా చేసిన నానికి ఈ చిత్రంలో చేసిన డ్యూయల్‌ రోల్స్‌ చాలా ప్రత్యేకంగా అనిపించాయట.

రెండు భిన్న ధృవాల్లాంటి పాత్రలని పోషించడం నటుడిగా చాలా సంతృప్తినిచ్చిందని, తనకి ఏదో ఒక రోజు ఫ్లాప్‌ వస్తుందనేది తెలుసునని, దానికి ప్రిపేర్‌ అయి వున్నాననీ... అయితే 'కృష్ణార్జున యుద్ధం' మాత్రం తన సక్సెస్‌ స్ట్రీక్‌ కొనసాగిస్తుందని నొక్కి వక్కాణించాడు. మరి నాని ఈ చిత్రానికి క్రేజ్‌ పెంచడానికి ఇలాంటి స్టేట్‌మెంట్లు ఇస్తున్నాడో లేక నిజంగానే ఇన్ని విజయాలు చూసిన తనని కూడా ఎక్సయిట్‌ చేసిన అంశం ఇందులో వుందో గురువారం తెలిసిపోతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English