ఈమెను మెహ్రీన్ వెర్షన్ 2.0 అనాలేమో

ఈమెను మెహ్రీన్ వెర్షన్ 2.0 అనాలేమో

అందమైన ముఖం... బుగ్గలపై చిన్న సొట్ట పడేలా చిరునవ్వు.. పర్ ఫెక్ట్ ఫిగర్.. తెలుగు సినిమా హీరోయిన్ కు ఉండాల్సిన బేసిక్ క్వాలిటీస్. అవన్నీ పుష్కలంగా ఉన్న హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా. కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ భామ పెద్దగా యాక్ట్ చే యాల్సిన పని లేకుండానే కెరీర్ ను సక్సెస్ గా లీడ్ చేస్తోంది. నటనపరంగా ఒక్క సినిమాలోనూ గొప్పగా చేసిందనే గుర్తింపు లేకపోయినా మెహ్రీన్ కు ఆఫర్లకు మాత్రం లోటు లేదు.

మెహ్రీన్ బాటలో ఇప్పుడు ఇంకో హీరోయిన్ బండి లాగించేస్తోంది. ఆమే నితిన్ హీరోగా నటించిన లై సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మేఘా ఆకాష్. నితిన్ తో ఆమె నటించిన రెండో సినిమా ఛల్ మోహనరంగా ఈ మధ్యనే థియేటర్లకొచ్చింది. ఈ రెండు చిత్రాల్లోనూ అందంగా మాత్రమే కనిపించిన మేఘాకు తాజాగా ఇంకో ఛాన్స్ వచ్చింది. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పక్కన హీరోయిన్ గా ఎంపికైంది. యాక్టింగ్ విషయంలో మెహ్రీన్ స్టయిల్లోనే సాగిపోతున్న మేఘాకు ఆఫర్లు కూడా అదే స్టయిల్లో వస్తుండటం విశేషం. అసలు చిన్నపాటి ఎక్సప్రెషన్లు కూడా సరిగ్గా పండించకపోయినా.. వీళ్లకు ఇన్నేసి చాన్సులు ఎలా వస్తున్నాయి అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు.

మేఘా ఆకాష్ ముందుగా ముందు గౌతమ్ మీనన్ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది. ఎనయ్ నోకి పాయం తోట సినిమాలో ధనుష్ పక్కన చేస్తోంది. ఎప్పుడో మొదలైన ఈ సినిమా షూటింగ్ ఇంకా కంప్లీట్ అవలేదు. ఈలోగా తెలుగులో నితిన్ పక్కన చేసిన రెండు సినిమాల షూటింగ్ చకచకా పూర్తయిపోయింది. గౌతమ్ మీనన్ సినిమాలో తన నటనకు గుర్తింపు వస్తుందని మేఘా ఆశిస్తొంది. చూద్దాం.. అందులో ఎంతమేరకు మెప్పిస్తుందో...


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English