రోజాకి కాదు.. రమ్యకృష్ణకు ఇవ్వాల్సింది

రోజాకి కాదు.. రమ్యకృష్ణకు ఇవ్వాల్సింది

మాజీ హీరోయిన్ రోజా ఇప్పుడు బోలెడన్ని పాత్రలను ఒకేసారి పోషించేస్తున్నారు. అటు ఎంఎల్ఏ గా కంటిన్యూ అవుతూనే.. ఇటు జబర్దస్త్ యాంకర్ గాను ఒదిగిపోతున్నారు. టీవీల్లో డిబేట్ లో పాల్గొనడం.. చాట్ షో నిర్వహించడం.. ఇలా ఎన్నో కార్యక్రమాలను ఒంటి చేత్తో నడిపించేస్తున్న నగరి ఎమ్మెల్యే రోజాకు.. ఇప్పుడు ఓ అవార్డు దక్కింది. రీసెంట్ గా అవార్డుల కార్యక్రమం నిర్వహించిన ఓ సంస్థ.. ఎవర్ గ్రీన్ హీరోయిన్ అవార్డును రోజాకు ఇచ్చింది.

సర్పయాగం అంటూ తన టీనేజ్ లోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. తన స్థాయిని అంచెలు అంచెలుగా పెంచుకుంటున్న రోజాకు ఈ అవార్డు రావడంపై పలువురు సానుకూలంగానే స్పందిస్తున్నారు. కానీ కొందరు మాత్రం.. రోజాకు కాకుండా ఆమె సమ కాలికురాలు అయిన మరో సీనియర్ నటికి ఈ పురస్కారం ఇచ్చి ఉండాల్సిందని అభిప్రాయపడుతున్నారు. ఆమె ఎవరో కాదు.. బాహుబలి సిరీస్ లో శివగామిగా మెప్పించిన రమ్యకృష్ణ.

గ్లామర్ హీరోయిన్ గా కెరీర్ కొనసాగించినంత కంటిన్యూ అయి.. ఆ తర్వాత యంగ్ అత్త పాత్రల్లోనూ ఒదిగిపోయి.. సీరియస్ పాత్ర అయిన శివగామిగా నటించి.. ఇప్పటికీ యాక్టింగ్ లో తన సత్తా చాటుతున్న రమ్యకృష్ణనే ఎవర్ గ్రీన్ హీరోయిన్ అనాలి వారి వాదన. ప్రస్తుతం సినిమాల్లో అసలు కనిపించడం మానేసిన రోజాను ఎవర్ గ్రీన్ హీరోయిన్ అని ఎలా అంటారన్నది వారి పాయింట్. ఇది కూడా కరెక్ట్ గానే అనిపిస్తోంది మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు