పిక్ టాక్: ఈ పిల్ల గుర్తుందా?

పిక్ టాక్: ఈ పిల్ల గుర్తుందా?

కొంతమందికి అంతే.. పేరు వస్తుంది కానీ.. గుర్తింపు రాదు. కొద్ది సమయానికి వచ్చిన ఆ కాసింత పేరు కూడా మర్చిపోవాల్సి వస్తుంది. కోలీవుడ్ భామ నివేదా పెతురాజ్ కు.. టాలీవుడ్ లో పరిస్థితి ఇలాగే ఉంది. మూడేళ్ల క్రితం తమిళ సినిమాల్లో అడుగుపెట్టిన ఈ మిస్ ఇండియా-యూఏఈ.. తన అందంతో అక్కడి జనాలను బాగానే ఆకట్టుకుంది.

వరుసగా మంచి సినిమాలను చేస్తూ.. ఆడియన్స్ ను మురిపించింది. ఈమెకు తెలుగులో కూడా అవకాశం వచ్చింది. మెంటల్ మదిలో అంటూ శ్రీవిష్ణుకు జోడీగా నటించేందుకు వచ్చిన అవకాశాన్ని పక్కాగా ఉపయోగించుకుని.. స్వేచ్ఛ పాత్రలో బాగా ఒదిగిపోయింది. ఆమె పాత్రకు.. నటనకు మంచి పేరే వచ్చింది కానీ.. తెలుగులో మళ్లీ అవకాశం రాకపోవడమే ఆశ్చర్యకరం. తమిళ్ లో కూడా కూడా చేతిలో ఉన్న మూడు సినిమాలు తప్ప కొత్త ఆఫర్స్ అందుతున్నట్లుగా కనిపించడం లేదు.

అందుకే ఇప్పుడు ఫోటో షూట్స్ అంటూ తనను తాను ప్రమోట్ చేసుకునే పనిలో పడిపోయింది నివేదా పెతురాజ్. తన నటనతో ఎంతగా ఇంప్రెస్ చేసినా అవకాశాలు అందడం లేదనే విషయాన్ని గమనించిన నివేద.. ఇప్పుడు తన అందాన్ని ప్రొజెక్ట్ చేసే పనిలో పడింది. అలాగని ఎక్స్ పోజింగ్ లాంటివేమీ చేయడం లేదు.. గ్లామర్ విషయంలో తన హద్దులు గీతలు ఎంతవరకూ ఉంటాయో.. ఎంతవరకూ చూపగలదో.. చెప్పకనే చెబుతోంది నివేదా పెతురాజ్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు