చిరు.. పవన్.. చరణ్.. ఒకే వేదికపై!

చిరు.. పవన్.. చరణ్.. ఒకే వేదికపై!

తమ్ముడొచ్చి అన్నయ్య కుటుంబంతో కలవడం కూడా పెద్ద వార్తే అయిపోతుంది ఈ రోజుల్లో. ఆ తమ్ముడు పవన్ కళ్యాణ్ అయితే.. అన్నయ్య చిరంజీవి. మధ్యలో కొన్నేళ్లు అన్నయ్యతో అంటీ ముట్టనట్లుగా ఉన్న పవన్. ఈ మధ్య చిరు కుటుంబాన్ని తరచుగా కలుస్తుండటం.. అన్నయ్య గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడుతుండటం గమనిస్తూనే ఉన్నాం.

మొన్న చరణ్ పుట్టిన రోజుకు చిరు ఇంట్లో భోజనానికి వెళ్లిన పవన్.. తాజాగా ప్రసాద్ ఐమాక్స్ లో చరణ్ సినిమా ‘రంగస్థలం’ చూసి విలేకరులతో కూడా మాట్లాడాడు. ఐతే ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు సక్సెస్ మీట్లో మాట్లాడాతానని పవన్ చెప్పడం మెగా అభిమానులకు ఎక్కడలేని ఉత్సాహాన్నిచ్చింది.

‘రంగస్థలం’ సక్సెస్ మీట్ త్వరలో జరగబోతోందని.. అందులో తాను పాల్గొంటానని హింట్ ఇచ్చి వెళ్లిపోయాడు పవన్. తాజా సమాచారం ప్రకారం ఈ వీకెండ్లో ‘రంగస్థలం’ సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నారట. ఈ వేడుకలో చరణ్.. పవన్ లతో పాటు చిరంజీవి కూడా పాల్గొంటాడట. ఈ ముగ్గురినీ ఒకే వేదిక మీద చూడబోతుండటం అభిమానులకు కనువిందే అనడంలో సందేహం లేదు.

ఈ వేడుక ప్రమోషన్ పరంగా కూడా ఉపయోగపడి వీకెండ్లో మంచి వసూళ్లు వస్తాయని భావిస్తున్నారు. చివరగా చిరు-పవన్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఆడియో వేడుకలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఇప్పుడు ‘రంగస్థలం’ సక్సెస్ మీట్లో వేదిక పంచుకోనున్నారు. చరణ్ కూడా ఈ వేడుకలో ఉంటాడు కాబట్టి ఎవరు ఎవరి గురించి ఏం మాట్లాడతారన్నది ఆసక్తికరం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు