ధనుష్ రేంజే వేరబ్బా..

ధనుష్ రేంజే వేరబ్బా..

ఒకప్పుడు ధనుష్‌ను చూసి ఇతను ఎలా స్టార్ అయ్యాడబ్బా అంటూ వేరే భాషల వాళ్లు ఎగతాళి చేసేవాళ్లు. కానీ అతడి సత్తా ఏంటో తర్వాత తర్వాతే తెలిసింది. ‘రఘువరన్ బీటెక్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలిచాడతను. మరోవైపు బాలీవుడ్లో ‘రాన్ జానా’.. ‘షమితాబ్’ లాంటి సినిమాలు నేషనల్ లెవెల్లో అతడికి గుర్తింపు తెచ్చాయి. ఇప్పుడతను ఏకంగా ఇంటర్నేషనల్ లెవెల్‌కి ఎదిగిపోయాడు. హలీవుడ్లో అతను ‘ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ఫాకిర్’ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం మే 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోోంది. ఈ చిత్రంలో ఉమా తుర్మన్ సహా పలువురు హాలీవుడ్ తారలతో కలిసి నటిస్తున్నాడు ధనుష్.

ఐతే అతనెళ్లి  హాలీవుడ్ తారలతోలో సినిమా చేయడమే కాదు.. ఇప్పుడు అతను నటించబోయే తమిళ సినిమాలో ఓ ప్రముఖ హాలీవుడ్ నటుడు నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘పిజ్జా’.. ‘జిగర్ తండా’ లాంటి సినిమాలతో గొప్ప పేరు సంపాదించిన యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్‌తో ధనుష్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో ప్రముఖ హాలీవుడ్ నటుడితో చేయించాలని చూస్తున్నట్లు కార్తీక్ వెల్లడించాడు. ఇప్పటికే ఆల్ పాసినో, డి నిరో లాంటి స్టార్లను సంప్రదించినట్లు కార్తీక్ తెలిపాడు. ఐతే వాళ్ల నుంచి ఏ సమాచారం లేదట. వీరిలో ఒకరు లేదా మరో ప్రముఖ హాలీవుడ్ నటుడితో ఈ చిత్రంలో కీలక పాత్ర చేయిస్తామని కార్తీ తెలిపాడు. మొత్తానికి ధనుష్ రేంజ్ మామూలుగా లేదని ఈ ఎంపికను బట్టే అర్థమవుతోంది. మరి ధనుష్ సినిమాలో నటించే హాలీవుడ్ నటుడెవరో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు