జగన్‌ హీరోయిన్‌కి పిచ్చ డిమాండ్‌

జగన్‌ హీరోయిన్‌కి పిచ్చ డిమాండ్‌

ప్రస్తుతం ఇండియాలో యూత్‌లో అత్యధిక ఫాలోయింగ్‌ వున్న నటి దిషా పటాని. బాలీవుడ్‌లో వేగంగా ఎదుగుతోన్న దిషా ముందుగా తెలుగు సినిమాతో తెరంగేట్రం చేసింది. దిషాని ముందుగా గుర్తించి హీరోయిన్‌ని చేసింది పూరి జగన్నాథ్‌. లోఫర్‌ సినిమాతో ఆమెని టాలీవుడ్‌కి పరిచయం చేసాడు జగన్‌. కానీ ఇక్కడ క్లిక్‌ కాలేకపోయింది. బాలీవుడ్‌ ఈ పొడుగు కాళ్ల సుందరి ఇమ్మీడియట్‌గా గుర్తించి అవకాశాలిచ్చింది. ఇంతలో దిషా కూడా తన కళ్లు చెదిరే ఫిజిక్‌ని మా గొప్పగా వాడేసుకుని సోషల్‌ మీడియాలో చాలా క్రేజ్‌ సాధించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో దిషా అంత ఫాస్ట్‌గా టాప్‌లోకి ఎదిగిన మరో ఇండియన్‌ సెలబ్రిటీ లేదని స్టాటిస్టిక్స్‌ చెబుతున్నాయి.

బాలీవుడ్‌లో బిజీ కావడానికి కావాల్సిన ఆ ఒక్క బ్లాక్‌బస్టర్‌ కోసం ఇంతకాలం ఎదురు చూసిన దిషాకి అది రానే వచ్చింది. 'బాఘీ 2' చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్‌ని షేక్‌ చేసేస్తోంది. టైగర్‌ ష్రాఫ్‌ కెరియర్లోనే పెద్ద హిట్‌ అయిన ఈ చిత్రం నూట యాభై కోట్లకి పైగా వసూళ్లని ఇండియాలో సాధించనుంది. కేవలం టైగర్‌, దిషాకి యూత్‌లో వున్న ఫాలోయింగ్‌ ఈ చిత్రాన్ని ఇంత హిట్‌ చేసిందని ట్రేడ్‌ విశ్లేషకులు చెబుతున్నారు. ఆమెకి యూత్‌లో వున్న క్రేజ్‌ గుర్తించిన బాలీవుడ్‌ నిర్మాతలు ఇప్పుడు దిషా డేట్స్‌ కోసం పోటీ పడుతున్నారు. కొంతమంది ఆల్రెడీ వేరే వాళ్లతో చేసుకున్న ఒప్పందాలు కాన్సిల్‌ చేసుకుని దిషాతో వారిని రీప్లేస్‌ చేయాలని చూస్తున్నారు. దీపిక, ప్రియాంక లాంటి వాళ్లు మరీ ఓల్డ్‌ అయిపోవడంతో బాలీవుడ్‌ నంబర్‌వన్‌ హీరోయిన్‌ కిరీటం చేజిక్కించుకోవడానికి దిషాకి మంచి ఛాన్సే వుందండోయ్‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు