నితిన్‌ మళ్లీ రాంగ్‌ స్టెప్‌ వేసాడు

నితిన్‌ మళ్లీ రాంగ్‌ స్టెప్‌ వేసాడు

ఏ సినిమాకి అయినా రిలీజ్‌ టైమింగ్‌ చాలా కీలకం. కొన్నిసార్లు సరైన టైమ్‌కి వచ్చిన సినిమాలు యావరేజ్‌గా వున్నా పాస్‌ అయిపోతాయి. టైమింగ్‌ సరిలేకపోతే మంచి సినిమాలు కూడా సరిగ్గా వసూలు చేయలేకపోతాయి. 'లై' చిత్రాన్ని రెండు మాస్‌ చిత్రాలతో పాటు పోటీగా రిలీజ్‌ చేసిన నితిన్‌కి చేతులు కాలాయి. ఈగోకి పోయి ముందుగా మేము అనౌన్స్‌ చేసిన డేట్‌ అంటూ 'నేనే రాజు నేనే మంత్రి', 'జయ జానకీ నాయక' చిత్రాలతో పాటు 'లై' రిలీజ్‌ చేసారు. నామ మాత్రపు వసూళ్లు కూడా రాక డిజాస్టర్‌ అయింది. మళ్లీ నితిన్‌ సినిమాకి రిలీజ్‌ టైమింగ్‌ తేడా జరిగింది.

'ఛల్‌ మోహన్‌ రంగ' చిత్రాన్ని 'రంగస్థలం' లాంటి బ్లాక్‌బస్టర్‌ వచ్చిన ఆరు రోజులకి రిలీజ్‌ చేయడం పెద్ద మైనస్‌ అయింది. ఇంకా రంగస్థలం జోరు తగ్గక ముందు వచ్చిన ఈ చిత్రానికి సరయిన టాక్‌ కూడా రాకపోవడంతో దారుణంగా దెబ్బ తింది. రంగస్థలం అంతటి హిట్‌ అయిందని తెలిసినపుడు అయినా రిలీజ్‌ వాయిదా వేసుకునేందుకు చూడాల్సింది. కానీ ఒక సినిమా వల్ల అంత నష్టమేం వుంటుందంటూ తప్పుడు లెక్క వేసారు. మొదటి రోజు మినహా వసూళ్లు లేక ఈ చిత్రం ఫ్లాట్‌ బాట పట్టింది. భారీ సినిమాలొచ్చే టైమ్‌లో స్పేస్‌ చూసుకోవడం చాలా కీలకం. తదుపరి రాబోయే సినిమా దిల్‌ రాజుది కనుక ఇలాంటి టైమింగ్‌ ప్రాబ్లమ్స్‌ ఏమీ వుండవని ఫిక్స్‌ అయిపోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English