బన్నీకి నిజంగా అంత ఉందా?

బన్నీకి నిజంగా అంత ఉందా?

బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్‌ల పుట్టిన రోజులొస్తే.. వాళ్ల ఇళ్లు ఉండే వీధులు వేలాది మంది అభిమానులతో సందడిగా మారిపోతాయి. ఉదయాన్నే అభిమానులు పెద్ద ఎత్తున గుమిగూడటం... ఆ హీరోలిద్దరూ బయటికి వచ్చి అభిమానులకు అభివాదం చేయడం సంప్రదాయంగా మారింది. అమితాబ్ బచ్చన్ అయితే ప్రతి వారంలోనూ ఒక రోజు అభిమానులు ఇలా తనను కలిసే అవకాశం కల్పిస్తాడు. ఇంటి ముందు నుంచి అభిమానులకు అభివాదం చేయడానికే ఆయన ఒక దిమ్మె లాంటిది కూడా ఏర్పాటు చేసుకున్నారు.

ఇది ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సాంప్రదాయం. ఐతే టాలీవుడ్లో ఇలా ఏ హీరో చేయడు. ఇక్కడ హీరోల ఇళ్లు.. ఆఫీసుల దగ్గర అభిమానులకు సులువుగా ఎంట్రీ దొరకదు. హీరోలు ఈ విషయంలో అభిమానుల్ని ఎంటర్టైన్ చేయరు.

ఐతే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం భిన్నమైన దారిలో పయనిస్తున్నాడు. ఒకప్పుడు మెగా హీరోల్లో ఎవరి అభిమానులైనా.. మెగా అభిమానులుగానే పరిగణించేవాళ్లు. కానీ బన్నీ మాత్రం తనకంటూ  ఎక్స్‌క్లూజివ్ అభిమానుల్ని కోరుకుంటున్నాడు. తన పీఆర్ టీం ద్వారా వాళ్లను జాగ్రత్తగా మేనేజ్ చేస్తున్నాడు. మొబిలైజ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే బన్నీ పుట్టిన రోజు సందర్భంగా నిన్న గీతా ఆర్ట్స్ కార్యాలయం దగ్గర వేలాది మంది అభిమానులు గుమిగూడారు.

అల్లు అర్జున్ ఆఫీస్ మేడమీదికెక్కి అభిమానులకు అభివాదం చేయడం.. ఆ తర్వాత అభిమానుల మధ్యకు వచ్చి వాళ్లను పలకరించడం.. ఇదంతా చూస్తే మన జనాలకు అమితాబ్, షారుఖ్ లాంటి వాళ్లే గుర్తుకొచ్చారు. ఇదంతా అనుకోకుండా జరిగినట్లుగా అనిపించలేదు. ప్లాన్డ్‌గా చేసిన కార్యక్రమం లాగే కనిపించింది. తన ఫాలోయింగ్, క్రేజ్‌ను చాటడానికి బన్నీ ఇలా చేశాడేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మున్ముందు దీన్నో ఆనవాయితీగా మారుస్తాడేమో అల్లు హీరో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English