ఇప్పటికైనా పెద్దోళ్లు కదులుతారా?

ఇప్పటికైనా పెద్దోళ్లు కదులుతారా?

టాలీవుడ్ నటి శ్రీరెడ్డి గత కొన్ని రోజులుగా ఎన్నో సంచలనాలను సృష్టించే స్టేట్మెంట్స్ ఇస్తూనే ఉంది. క్యాస్టింగ్ కౌచ్‌కు సంబంధించిన ఎన్నో అంశాలను బయటపెడుతుండడమే కాదు.. ఇప్పటికే పలువురి పేర్లను నేరుగాను.. మరికొందరి పేర్లను ఇన్‌డైరెక్టుగాను వెల్లడించింది. ఇప్పుడు అన్నిటికీ మించిన ఓ హంగామా చేసి పారేసింది.

హైద్రాబాద్ ఫిలింనగర్‌లో శనివారం నాడు శ్రీరెడ్డి చేసిన అర్ధ నగ్న ప్రదర్శన చాలా పెద్ద విషయం. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు కల్పించాలని.. మోసపోయిన వాళ్లకు న్యాయం చేయాలని.. తనకు మా సభ్యత్వం ఇవ్వాలని.. దీనిపై సీఎం కేసీఆర్ స్పందించాలని.. ఇలా చాలానే డిమాండ్స్ చేసింది. ఇంత జరుగుతున్నా.. ఇప్పటివరకూ టాలీవుడ్ నుంచి పెద్దలు ఎవరూ ఈ అంశంపై స్పందించలేదు. నగ్నంగా రోడ్డు మీద నిలబడతానని బెదిరించినా రియాక్ట్ కాకపోవడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే. ఆమెకు మద్దతు పలకడమో.. శాంతపరిచేందుకు ప్రయత్నించడమో చేయడం మంచిదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

శ్రీరెడ్డి పుణ్యమా అని.. ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న టాలీవుడ్ పరువు మళ్లీ దిగజారుతోంది. ఇకనైనా పెద్దోళ్ళు రెస్పాండ్ అయితే బెటర్ అంటున్నారు పరిశీలకులు. మాకెందుకులే అని కూర్చుంటే.. రేపు ఇది పెద్ద ఇష్యూ అయిపోయి.. నేషనల్ మీడియా మనోళ్ళను ఫుట్ బాల్ ఆడుకునే ఛాన్సుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English