త్రివిక్రమ్ అందుకే రాలేదా?

త్రివిక్రమ్ అందుకే రాలేదా?

ఓవైపు పవన్ కళ్యాణ్.. మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఇలాంటి ప్రముఖులిద్దరు కలిసి ఒక యువ హీరోతో సినిమా తీస్తున్నారనగానే దానికి మంచి ప్రచారం వచ్చింది. పైగా ఈ చిత్రానికి త్రివిక్రమ్ కథ కూడా అందిస్తున్నాడంటే ఇందులో ఏదో ప్రత్యేకత ఉంటుందని ఆశించారు. ఇక ‘రౌడీ ఫెలో’ లాంటి వైవిధ్యమైన సినిమాతో దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే మెప్పించిన కృష్ణచైతన్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటం.. పైగా ఇది నితిన్‌కు 25వ సినిమా కావడంతో ‘చల్ మోహన్ రంగ’పై అంచనాలు పెరిగాయి. దీనికి తోడు ఈ చిత్ర ప్రోమోలు కూడా ఆకట్టుకున్నాయి.

ఇలా ఎన్నో అంచనాల మధ్య సినిమాకు వెళ్తే.. చాలా సాదాసీదా సినిమా చూపించి పంపించారు. కామెడీతో సినిమా కొంత వరకు టైంపాస్ చేయించిన మాట వాస్తవం.. కానీ ఈ కాంబినేషన్‌ తెచ్చిన క్యూరియాసిటీకి తగ్గ సినిమానా ఇది అంటే ఎంతమాత్రం కాదు.

గతంలో త్రివిక్రమ్ రచయితగా ఎలాంటి సినిమాలు అందించాడో గుర్తు చేసుకుంటే.. ఆయన స్థాయి ఇప్పుడు ఎలా పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ‘అజ్ఞాతవాసి’తో ఆల్రెడీ త్రివిక్రమ్ ఇమేజ్ బాగా డ్యామేజ్ అయింది. ఇప్పుడు ఆయన పెన్నుకు ఏమైందా అన్న సందేహాలు మరింతగా కలిగించింది ‘చల్ మోహన్ రంగ’. కథగా చెప్పుకోవడానికి ఇందులో ఏమీ లేదు. త్రివిక్రమ్ కెరీర్లో అత్యంత పేలవమైన.. సాధారణమైన కథ ఇదే అంటే ఆశ్చర్యమేమీ లేదు. కాకపోతే త్రివిక్రమ్ మార్కు పంచులు మాత్రం ఇందులో ఉన్నాయి.

త్రివిక్రమ్ స్ఫూర్తితో కృష్ణ చైతన్యే ఆయన తరహా వినోదంతో స్క్రిప్టును తీర్చిదిద్దినట్లున్నాడు. ఐతే ఇలాంటి కాంబినేషన్లో తెరకెక్కిన సినిమాకు ఇలాంటి కథ అందించాలని త్రివిక్రమ్‌కు ఎలా అనిపించిందో? కథ ఇచ్చాడు సరే.. అసలు త్రివిక్రమ్ ఈ సినిమా చూశాడా అన్నది డౌటు. చూసి డిజప్పాయింట్ అయ్యాకే ఈ చిత్ర ప్రమోషన్‌కు దూరంగా ఉండిపోయాడేమో అని సందేహాలు కలుగుతున్నాయి జనాలకు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English