ఆ సినిమా చేస్తే కాజల్ ను మర్చిపోవాలా?

ఆ సినిమా చేస్తే కాజల్ ను మర్చిపోవాలా?

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇప్పటికీ యంగ్ హీరోలతో సినిమాలు అందుకుంటూ దూసుకుపోతోంది. రానాతో నేనే రాజు నేనే మంత్రి.. కళ్యాణ్ రామ్ పక్కన ఎంఎల్ఏ మూవీతో పాటు.. రీసెంట్ గా అ! అంటూ తెరకెక్కిన డిఫరెంట్ సినిమాలో కూడా యాక్ట్ చేసింది.

ఇలాంటి సమయంలో చందమామకు దగ్గరు ఓ బ్రహ్మాండమైన ఆఫర్ వచ్చిందట. సినిమాకు కోటి పుచ్చుకునే కాజల్ దగ్గరకు.. 2 కోట్ల పారితోషికం ఇస్తామంటూ మేకర్స్ అప్రోచ్ అయ్యారట. పి.వాసు లాంటి దర్శకుడు రూపొందించే సినిమా కావడంతో.. క్రేజీ ప్రాజెక్ట్ అయినా సరే.. కాజల్ ఈ ఆఫర్ ను తోసిపుచ్చిందట. ఇందుకు కారణం.. ఇది ఫిమేల్ సెంట్రిక్ మూవీ కావడమే. ఇండస్ట్రీలోకి వచ్చి దశాబ్దం దాటినా.. ఇప్పటికీ ఎలాంటి రిస్క్ చేయకుండా కెరీర్ కంటిన్యూ చేసుకుంటున్న కాజల్ కు.. లేడీ ఓరియెంటెడ్ మూవీ చేయడం బాగా రిస్క్ అనే చెప్పాలి. ఇలాంటి సినిమాలు ఒప్పుకుంటే.. ఇక గ్లామర్ హీరోయిన్ పాత్రలకు దూరం చేసేస్తారు మేకర్స్.

పెద్ద హీరోలు కూడా ఆమె పేరును పరిగణించడం మానేస్తారనే విషయంపై బాగానే ఐడియా ఉన్న చందమామ.. అందుకే 2 కోట్లు ఒకవైపు ఊరిస్తున్నా సరే.. కెరీర్ ను దృష్టిలో పెట్టుకుని సినిమాను కాదనుకుందని అంటున్నారు. తన కెరీర్ చరమాంకంకు వచ్చేసిందనే ఐడియాను ఫిలిం మేకర్స్ కు ఇచ్చినట్లవుతుందని భావించిందట కాజల్. ఇందుకు బదులుగా సమంత మాదిరిగా హీరో ఓరియెంటెడ్ పాత్రలలోనే తన సత్తా చాటే రోల్స్ వస్తే చేయాలనే ఆలోచనను మనసులో స్ట్రాంగ్ గా ఫిక్స్ చేసుకుందని అంటున్నారు చందమామ సన్నిహితులు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు