మహేష్‌ సార్.. నన్ను రిపీట్ చేయండి ప్లీజ్

మహేష్‌ సార్.. నన్ను రిపీట్ చేయండి ప్లీజ్

భరత్ అనే నేను మూవీ బహిరంగ సభ అంగరంగ వైభవంగా హైద్రాబాద్ లో నిర్వహించారు. మహేష్ బాబుకు జోడీగా ఈ మూవీలో బాలీవుడ్ భామ కైరా అద్వానీ నటిస్తోంది. ఆడియో ఫంక్షన్ సందర్భంగా వచ్చీ రాని తెలుగు మాటలతో వీలైనంతగా ఇంగ్లీష్ లోనే మాట్లాడింది కైరా.

'థ్యాంక్యూ హైద్రాబాద్ ఫర్ వార్మ్ వెల్కం. నా మైండ్ లో చాలానే అంశాలున్నాయి. కానీ ఎక్కడ మొదలుపెట్టాలో తెలియడం లేదు. అద్భుతమైన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో భాగం అయినందుకు సంతోషంగా ఉంది. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన నిర్మాత దానయ్య గారికి.. దర్శకుడు కొరటాల శివ గారికి ధన్యవాదాలు. నాపై నమ్మకం ఉంచారు దర్శకులు శివ. మీ అంతటి నెమ్మదస్తులను ఎప్పుడూ చూడలేదు. ఇక మహేష్ గారి గురించి చాలా చెప్పాలి. సార్ అని పిలవద్దని మొదటి సారి కలిసినపుడే మీరు చెప్పారు. కానీ ఆ పదం వదిలేయడం కుదురుతుందని అసలు అనుకోవడం లేదు. ఒక వ్యక్తిగా.. ఒక నటుడిగా మీపై ఆ గౌరవం ఎప్పుడూ ఉండిపోతుంది. నాకు మరో ఇల్లు అనిపించేలా భావన కలిగించిన నమ్రత గారికి కూడా కృతజ్ఞతలు' అని చెప్పింది కైరా అద్వానీ

'మహేష్ గారూ.. మీరు ఎంతో ఓపిక ఉన్న సహనటుడు. మీతో మళ్లీ వర్క్ చేయాలని ఉంది. కానీ మీరు మీ హీరోయిన్లను రిపీట్ చేయరనే విషయం నాకు తెలుసు. కానీ నాకు మరో అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను. ఇక భరత్ అనే నేను మూవీలో అన్ని అంశాలు అలరిస్తాయి. ముఖ్యంగా పాటలు అయితే అద్భుతం అంతే. దేవిశ్రీ ప్రసాద్ నిజంగా రాక్ స్టార్. ఇంత మంచి ఆల్బం ఎప్పుడూ వినలేదు. టీంలో ప్రతీ ఒక్కరు ఎంతో సపోర్ట్ చేశారు' అంటూ ఈ నెల 20న సినిమా రిలీజ్ అంటోంది కైరా అద్వానీ.