నాటు స్టెప్పులు ఇరగేశాడుగా

నాటు స్టెప్పులు ఇరగేశాడుగా

ఎలాంటి క్యారెక్టర్ అయినా సరే ఇరగదీసేయడం హీరో నానికి బాగా అలవాటు అయిపోయింది. అసలు ఆయా క్యారెక్టర్లలో నటించేయడం కాకుండా.. ప్రతీ పాత్రలోను సహజసిద్ధంగా ఒదిగిపోతుండడంతోనే.. న్యాచురల్ స్టార్ అని అందరితో ముద్దుగా పిలిపించేసుకుంటున్నాడు.

ప్రస్తుతం కృష్ణార్జున యుద్ధం అంటూ సినిమాను రిలీజ్ కి సిద్ధం చేశాడు నాని. ఈ సినిమాలో ' దారి చూడు' అంటూ సాగే పాట ఇప్పటికే లిరికల్ గా బాగా సక్సెస్ సాధించింది. ఈ పాట థియేటర్లలో ఎలా ఉంటుందనే అంచనాలతో ఉన్నారు ఆడియన్స్. మూవీ రిలీజ్ మరో వారం కూడా గ్యాప్ లేని సమయంలో.. ఇప్పుడీ పాటకు ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. జనాలు ఏ రేంజ్ లో ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారో.. వాటికి ఏ మాత్రం తగ్గకుండా పాటను పిక్చరైజ్ చేశాడు దర్శకుడు మేర్లపాక గాంధీ. ప్రతీ ఫ్రేమ్ లోను నాటు స్టెప్పులను ఇరగదీసి పారేశాడు. పక్కా మాస్ క్యారెక్టర్ తనకు పడితే.. తాను ఏ స్థాయిలో చెలరేగిపోతాడో చూపించాడు నాని. హిప్ హాప్ తమిళ కొట్టిన బీట్ కు.. ఒక రకంగా ప్రాణం పోసేశాడు నాని.

దారి చూడు సాంగ్ మాస్ ఆడియన్స్ ను థియేటర్లలో ఉర్రూతలు ఊగించడం ఖాయంగా కనిపిస్తోంది. చిత్తూరు చిల్లా యాసతో సాగిన పాటకు.. తనవైన ఫీలింగ్స్ తో పండించేశాడు న్యాచురల్ స్టార్. ఈ పాట విడుదల తర్వాత కచ్చితంగా కృష్ణార్జున యుద్ధంపై అంచనాలు మరింతగా పెరుగుతాయని అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English