రామ్‌ చరణ్‌ అరుదైన ఫీట్‌

రామ్‌ చరణ్‌ అరుదైన ఫీట్‌

రంగస్థలం తెలుగు రాష్ట్రాల్లోనే అరవై కోట్లకి పైగా షేర్‌ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘనత రెండుసార్లు సాధించిన ఖ్యాతి చరణ్‌కి దక్కింది. బాహుబలి చిత్రాలని మినహాయిస్తే ఇంతవరకు ఈ క్లబ్‌లో వున్నవి మగధీర, ఖైదీ నంబర్‌ 150 చిత్రాలు మాత్రమే. రంగస్థలంతో మరోసారి లోకల్‌ మార్కెట్‌లో తానెంత స్ట్రాంగ్‌ అనేది చరణ్‌ నిరూపించాడు. ఎనివిదవ రోజున కూడా హౌస్‌ఫుల్స్‌ నమోదు చేసిన రంగస్థలం ఈ వారాంతంలోను మంచి వసూళ్లు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.

గురువారం విడుదలైన 'ఛల్‌ మోహన్‌ రంగ' ఆకట్టుకోలేకపోవడంతో రంగస్థలం డామినేషన్‌ కొనసాగుతోంది.  కేవలం సింగిల్‌ స్క్రీన్స్‌లోనే కాకుండా మల్టీప్లెక్సుల్లోను రంగస్థలమే టాప్‌ పొజిషన్‌లో వుంది. మరోవైపు యుఎస్‌లో కూడా రంగస్థలం వసూళ్లు ఛల్‌ మోహన్‌ రంగ కంటే ఎక్కువే వస్తున్నాయి. ఈ వారాంతానికి తొంభై నుంచి తొంభై అయిదు కోట్ల వరకు షేర్‌ వసూలు అవుతుందని అంచనా. రెండవ వారం ముగిసేలోగా వంద కోట్ల షేర్‌ దాటుతుందట. ఫుల్‌ రన్‌లో ఖైదీ నంబర్‌ 150 రికార్డుని దాటి నాన్‌ బాహుబలి రికార్డు నెలకొల్పడం కూడా సుసాధ్యమేననిపిస్తోంది. సమ్మర్‌లో రాబోయే మిగతా భారీ చిత్రాలకి పెద్ద టార్గెట్‌నే సెట్‌ చేసి పెడుతున్నాడు చెర్రీ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు