బిగ్‌బాస్‌లో చోటు కోసమే బరి తెగించిందా?

బిగ్‌బాస్‌లో చోటు కోసమే బరి తెగించిందా?

నటి శ్రీరెడ్డి చేస్తోన్న రభస తారాస్థాయికి చేరుకుంది. ఫిలించాంబర్‌ ప్రాంగణంలో అర్ధ నగ్న ప్రదర్శనని లైవ్‌లో చేసింది. అవకాశాలు రాకపోవడం వల్ల, మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌లో సభ్యత్వం ఇవ్వకపోవడం వల్ల ఈ నిరసన చేస్తున్నట్టు ఆమె తెలిపింది. సినిమా ఆర్టిస్ట్‌గా గుర్తింపు కోసం బట్టలు విప్పి ప్రదర్శన చేయడంలో లాజిక్‌ ఏమిటనేది ఆమెకే తెలియాలి. టీఆర్పీల కోసం ఆవురావురుమంటోన్న ఛానళ్లకి ఈమె ఇలా డెయిలీ ఏదో ఒక కార్యక్రమం చేపడుతూ సాయపడుతోంది.

ఇదిలావుంటే అసలు శ్రీరెడ్డి ఎందుకోసం ఇలాంటి పనులు చేస్తోంది? ఇలా కాంట్రవర్సీ ముద్ర వేయించుకోవడం వల్ల, ఈ విధంగా పాపులర్‌ అవడం వల్ల ఆమెకి వచ్చే బెనిఫిట్‌ ఏమిటి? బిగ్‌బాస్‌ సీజన్‌ 2లో అవకాశం కోసమే ఆమె ఈ రూట్‌ ఎంచుకుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. హిందీలో ఈ షోలో అవకాశం పొందిన వారిలో ఇలాంటి కాంట్రవర్షియల్‌ పర్సనాలిటీస్‌ ఎక్కువ. తెలుగులో మొదటి సీజన్‌లో ఆ తరహా వివాదాస్పద వ్యక్తులు లేకపోయినా, షో నుంచి బయటకి వచ్చాక కొందరు దానిని తెలివిగా తమ పాపులారిటీకి వాడేసుకున్నారు. బిగ్‌ బాస్‌ షో నడిచేదే గొడవలు పడే స్వభావం వున్న వారి వల్ల కనుక ఇలాంటి పర్సనాలిటీస్‌ని ఏరి కోరి తీసుకుంటూ వుంటారు. ఒకవేళ శ్రీరెడ్డి టార్గెట్‌ అదే అయినట్టయితే ఇంకా ఆమె బిగ్‌బాస్‌ షో నిర్వాహకుల దృష్టిలో పడిందో లేదో? ఈమె పాపులర్‌ అయ్యే కొద్దీ టాలీవుడ్‌ పెద్దలకి గుబులు పుడుతోంది. మరింత మంది ఇలాంటి దారి ఎంచుకుని పాపులర్‌ అవ్వాలని ట్రై చేస్తే మా పరువేంగాను అని కంగారు కలుగుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English