మహేష్‌, తారక్‌ అదరహో!

మహేష్‌, తారక్‌ అదరహో!

ఒక అగ్ర హీరో సినిమా వేడుకకి మరో అగ్ర హీరోని ముఖ్య అతిథిగా పిలవడం చాలా చాలా అరుదు. ప్రతి హీరో సినిమా వేడుక పర్సనల్‌ ఈవెంట్‌గా ఫ్యామిలీకి క్లోజ్‌ అయిన హీరోల సమక్షంలోనే జరుగుతూ వుండగా ఎన్టీఆర్‌ని ముఖ్య అతిథిగా పిలిచి 'భరత్‌ అనే నేను' బృందం హృదయాలని గెలుచుకుంది. ఎన్టీఆర్‌ని ఆహ్వానించి మహేష్‌ బేషజాలు లేని తన తత్వం తెలుపగా, ఆ ఆహ్వానాన్ని మన్నించి వస్తూ తారక్‌ తన గొప్పతనాన్ని చాటుకున్నాడు. ఇదిలావుంటే మహేష్‌ తనకి సమవుజ్జీ అయిన రామ్‌ చరణ్‌ చిత్రాన్ని, అతని నటనని ప్రశంసించి మరోసారి తన ఈగోలెస్‌ క్యారెక్టర్‌ చూపెట్టాడు. అంతకుముందే చరణ్‌ గురించి, రంగస్థలం గురించి ట్వీట్‌ చేసి తారక్‌ కూడా హృదయాలు గెలుచుకున్నాడు.

వృత్తిపరంగా పోటీ వున్నా కానీ వ్యక్తిగతంగా వీరందరి మధ్య స్నేహ సంబంధాలున్నాయి. ఎన్టీఆర్‌, చరణ్‌ క్లోజ్‌ అనేది వాళ్లు కార్‌లో కలిసి వెళ్లినపుడే తెలిసింది. మహేష్‌ కుటుంబంతో చరణ్‌ ఫ్యామిలీ విదేశీ టూర్‌కి కూడా వెళ్లింది. అభిమానుల మధ్య వైరాలు కంటిన్యూ అవుతున్నా కానీ, తమ పోటీ హీరో గురించి పబ్లిక్‌గా ప్రశంసిస్తే ఫాన్స్‌ కాస్త నొచ్చుకుంటారని తెలిసినా కానీ మహేష్‌, తారక్‌ అవేమీ పట్టించుకోకుండా మనస్ఫూర్తిగా ఎదుటి హీరో విజయాన్ని హర్షిస్తూ తమ గొప్ప స్వభావాన్ని చాటుకున్నారు. ఇలాంటివి చూసయినా సోషల్‌ మీడియాలో ఎదుటి హీరోలపై బురద జల్లే తత్వం మరుగున పడితే బాగుంటుంది కదూ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు