మహేష్‌ను చరణ్ కొట్టేస్తున్నాడహో..

మహేష్‌ను చరణ్ కొట్టేస్తున్నాడహో..

యుఎస్ బాక్సాఫీస్‌లో మహేష్ బాబు హవానే వేరు. ‘బాహుబలి: ది కంక్లూజన్’ ఏకంగా 20 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించి ఉండొచ్చు గాక అక్కడ మార్కెట్ పరంగా నంబర్ వన్ తెలుగు హీరో ఎవరంటే మాత్రం మహేష్ బాబు పేరే చెప్పాలి. డిజాస్టర్ సినిమాలతో కూడా మిలియన్ డాలర్ల వసూళ్లు కొల్లగొట్టగల సత్తా మహేష్ సొంతం. అతడి సినిమాలు ప్రిమియర్లతోనే ఆ మార్కును అందుకుంటూ ఉంటాయి.

మహేష్‌కు సరైన సినిమా పడితే వసూళ్ల మోత ఎలా ఉంటుందో మూడేళ్ల కిందట ‘శ్రీమంతుడు’ రుజువు చేసింది. 2 మిలియన్ డాలర్ల వసూళ్లే గొప్ప అనుకుంటున్న సమయంలో ఆ చిత్రం 3 మిలియన్ డాలర్ల మార్కుకు చేరువగా వెళ్లింది. ఫుల్ రన్లో ఆ చిత్రం అక్కడ 2.89 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. మూడేళ్లుగా ఈ నాన్-బాహుబలి రికార్డు చెక్కు చెదరకుండా ఉంది.

ఎట్టకేలకు ఆ రికార్డుకు ఎసరు పెట్టింది ‘రంగస్థలం’. తొలి వారాంతంలోనే ఈ చిత్రం 2 మిలియన్ డాలర్ల క్లబ్బులో చేరిన సంగతి తెలిసిందే. ఈ శుక్రవారానికి ఈ చిత్ర యుఎస్ వసూళ్లు 2.859 డాలర్లకు చేరడం విశేషం. ‘శ్రీమంతుడు’ రికార్డుకు అత్యంత చేరువగా వచ్చిన ఈ చిత్రం శనివారం ఆ రికార్డును దాటేయడం లాంఛనమే. అంతే కాదు.. 3 మిలియన్ క్లబ్బులోకి చేరడం కూడా పక్కానే. శని, ఆది వారాల్లో వసూళ్లు భారీగానే ఉంటాయని భావిస్తున్నారు. ఈ చిత్రం 3.5 మిలియన్ డాలర్ల మార్కును కూడా అందుకున్నా ఆశ్చర్యం లేదు. మరోవైపు ‘రంగస్థలం’ ఓవరాల్ కలెక్షన్ షేర్ రూ.

70 కోట్ల మార్కును దాటింది. వారాంతంలో రూ.80 కోట్ల షేర్ మార్కును దాటేయొచ్చని భావిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు