పవన్ చేయాలనుకున్న తప్పే రవితేజ..?

పవన్ చేయాలనుకున్న తప్పే రవితేజ..?

చిరంజీవి తర్వాత టాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్లుగా పవన్ కళ్యాణ్, మహేష్ బాబుల పేర్లు చెప్పుకోవాలి. ఐతే సినిమాల ఎంపికలో వీళ్ల ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. మహేష్ బాబు అసలు రీమేక్‌ల జోలికే వెళ్లడు. కానీ పవన్‌కు మాత్రం వాటిపై మోజు ఎక్కువే. కెరీర్లో చాలానే రీమేక్‌లు చేశాడతను. పవన్ గత ఏడాది చేసిన ‘కాటమరాయుడు’ కూడా రీమేకే అన్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా పవన్ మరో రెండు రీమేకుల్లో నటించాలని అనుకున్నాడు. కానీ రాజకీయాల్లో పడిపోవడంతో వాటి సంగతి ఎటూ తేలకుండా పోయింది. పవన్ చేయాలనుకున్న రీమేక్‌ల్లో ‘తెరి’ ఒకటి.

తెలుగులోకి ‘పోలీస్’ పేరుతో అనువాదమై విడుదలైనా సరే.. దాన్నే కొంచెం మార్చి పవన్ కళ్యాణ్‌తో తీయాలని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భావించింది. ఇందుకోసం సంతోష్ శ్రీనివాస్‌ను దర్శకుడిగా ఎంచుకుంది. కొన్ని నెలల పాటు స్క్రిప్ట్ వర్క్ కూడా జరిగింది. కానీ పవన్ ఎంతకీ అందుబాటులోకి రాకపోవడంతో సంతోష్ బయటికి వచ్చేశాడు. రవితేజ హీరోగా సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు.

ఐతే పవన్ కోసం సిద్ధం చేసిన స్క్రిప్టుతోనే అతను రవితేజతో సినిమా చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. కానీ చాలా రొటీన్‌గా అనిపించడమే కాక.. ఆల్రెడీ తెలుగులోనూ విడుదలైన సినిమాను రీమేక్ చేయాలనుకోవడం సాహసమే అవుతుంది. పవన్ ఈ సినిమా చేస్తాడన్నపుడే అందరూ తప్పుబట్టారు. మరి పవన్ చేయాలనుకున్న తప్పునే రవితేజ చేస్తాడా.. ఈ ప్రచారానికి భిన్నంగా వేరే కథతో ఈ సినిమా తెరకెక్కబోతోందా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు