అసలు కిక్కు ఇప్పుడొచ్చింది మహేష్..

అసలు కిక్కు ఇప్పుడొచ్చింది మహేష్..

మహేష్ బాబు, కొరటాల శివ, దేవిశ్రీ ప్రసాద్.. మామూలు కాంబినేషన్ కాదిది. ఇంతకుముందు ఈ కాంబోలో వచ్చిన ‘శ్రీమంతుడు’ ఆడియో అప్పట్లో సూపర్ హిట్టయ్యాయి. ఆ పాటలు మార్మోగాయి. కొరటాలతో దేవి చేసిన మిగతా రెండు సినిమాల ఆడియోలు కూడా సూపర్ హిట్లే. దీంతో ‘భరత్ అనే నేను’ ఆడియో మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నుంచి ఇంతకుముదు వచ్చని రెండు పాటలు ఓకే అనిపించాయి కానీ.. అంచనాలకు తగ్గట్లు మాత్రం లేవు. ముఖ్యంగా ప్రేక్షకుల్లో ఊపు తెచ్చేలా ఆ పాటలు లేవన్న వ్యాఖ్యానాలు వినిపించాయి.

ఐతే నిన్న ఈ సినిమా నుంచి ‘వచ్చాడయ్యా సామి’ అనే పాట విడుదల చేశారు. ఆ పాట విన్నాక ఇది కదా మాక్కావాల్సింది అంటున్నారు అభిమానులు. ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ ఇచ్చేలా ఉంది ఈ పాట. ‘మిర్చి’లో పండగలా దిగి వచ్చాడు పాటను తలపించింది ఈ సాంగ్. వినసొంపుగా ఉంటూనే ఉత్సాహం తెచ్చేలా ఉంది. అలాగే ఇందులోని సాహిత్యం చాలా హృద్యంగా ఉంది. రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన సాహిత్యం అందించాడు. కైలాష్ ఖేర్.. దివ్య కుమార్ చాలా బాగా పాడారీ పాట. మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉన్న ఈ పాట ఇన్‌స్టంట్ హిట్టయిపోయింది.

సినిమాలో ఈ పాట ఎలా ఉంటుందో అన్న ఆసక్తి రేకెత్తించింది. ఆడియోలోని మిగతా పాటలు కూడా ఇలాగే ఉండాలని మహేష్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. శనివారం ఈ చిత్ర ఆడియో వేడుక ఘనంగా చేయబోతున్నారు. ఈ సందర్భంగానే ఆడియో అందుబాటులోకి రానుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English