ఖైదీ నంబర్ 106ని కలిసిన ప్రీతి జింటా

ఖైదీ నంబర్ 106ని కలిసిన ప్రీతి జింటా

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఇప్పుడు జోధ్ పూర్ జైల్ లో ఊచలు లెక్కపెట్టుకుంటున్న సంగతి తెలిసిందే. 1998 నాటి కృష్ణ జింకల వేట కేసులో సల్మాన్ కు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. హమ్ సాథ్ సాథ్ హై మూవీ షూటింగ్ రాజస్థాన్ లో జరుగుతున్న సమయంలో.. సైఫ్ అలీ ఖాన్.. నీలమ్.. టబు.. సోనాలి బింద్రేలతో కలిసి జింకలను వేటాడగా.. ఈ కేసులు సల్మాన్ మినహా మిగిలిన అందరినీ నిర్దోషులుగా నిర్ధారించిన కోర్టు.. సల్లూభాయ్ కి ఐదేళ్లపాటు కారాగారవాసం విధించింది.

ఇలా కోర్టు తీర్పు వచ్చిందో లేదో.. సైఫ్.. నీలం.. టబు.. సోనాలి.. ఇలా అందరూ జోధ్ పూర్ వదిలి ముంబై వెళ్లిపోయారు. శిక్ష ప్రకటించిన సమయంలో సల్మాన్ తో పాటు కోర్టు రూమ్ లో అతని సోదరీమణులు అల్విరా.. అర్పితలతో పాటు బాడీగార్డ్ షెరా ఉన్నారు. అయితే.. సల్మాన్ తో కలిసి పలు సినిమాల్లో నటించిన ప్రీతి జింటా మాత్రం ఇవాళ ఉదయం జోధ్ పూర్ కు చేరుకుంది. పెద్ద టోపీని ధరించి మొహం కవర్ చేసుకునేందుకు ప్రయత్నించిన ఈ భామ.. నేరుగా జైలుకు వెళ్లి తన పాత స్నేహితుడిని కలిసింది. గంటకు పైగా జైల్ లో గడిపిన ఈమె.. పలు స్వాంతన వచనాలు పలికినట్లు తెలుస్తోంది.

జోధ్ పూర్ జైల్ లో సాధారణ ఖైదీ మాదిరి జీవితం అనుభవిస్తున్న సల్మాన్ కు 106 నెంబర్ కేటాయించారు. 2వ నెంబర్ బరాక్ లో ఉన్న సల్మాన్.. బెయిల్ పిటిషన్ వేయగా.. రేపటికి ఈ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసింది కోర్టు. దీంతో ఇవాళ కూడా సల్మాన్ కు జైల్ లో గడపక తప్పలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు