ఇంతకీ నితిన్ ఫ్యాన్స్ ఎక్కడ భయ్యా?

ఇంతకీ నితిన్ ఫ్యాన్స్ ఎక్కడ భయ్యా?

యంగ్ హీరో నితిన్ నటించిన ఛల్ మోహన్ రంగ థియేటర్లలోకి వచ్చింది. ఇవాళే రిలీజ్ అయిన ఈ సినిమాకు.. ఆరంభం నుంచే మంచి టాక్ వచ్చేసింది. ఎంటర్టెయిన్మెంట్ విషయంలో ఎక్కడా లోటు లేకపోవడంతో సినిమా సక్సెస్ ఖాయం అంటున్నారు. ముందు నుంచే హిట్టు కళ కొట్టొచ్చినట్లు కనిపించగా.. సోషల్ మీడియాలో కూడా ఛల్ మోహన్ రంగ హంగామా బాగానే ఉంది.

ఛల్ మోహన్ రంగ మూవీ అదిరిపోయిందని.. త్రివిక్రమ మార్క్ డైలాగ్స్ అలరించేశాయని.. తమన్ మ్యూజిక్ ఇరగదీశాడని.. కామెడీ కేకలా ఉందని.. ఇలా రకరకాల కామెంట్స్ తో సినిమాను పొగుడుతున్నారు జనాలు. మొత్తం మీద నితిన్ 25వ సినిమా సక్సెస్ అని మొదటి రోజే తీర్పు ఇచ్చేశారు. ఇంతకీ ఇదంతా చేస్తోంది ఎవరు అంటే మాత్రం.. మాగ్జిమమ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కనిపిస్తున్నారు. ఛల్ మోహన్ రంగ సినిమాపై అందరిలోనూ క్యూరియాసిటీ పెరగడానికి కారణాల్లో.. పవన్ కూడా నిర్మాతగా వ్యవహరించడం ఒకటి.

పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై.. వేరే హీరోతో తీసిన మొదటి సినిమా ఇది. అందుకే పవన్ ఫ్యాన్స్ హంగామా ఫుల్లుగా కనిపిస్తోంది. అయితే.. పవర్ స్టార్ అభిమానుల హంగామా దెబ్బకి.. నితిన్ ఫ్యాన్స్ ఎక్కడా కనిపించడం లేదు. ఏదేమైతేనేం.. మొత్తం మీద పవన్ బ్యానర్ స్క్రీన్ పై పడ్డాక.. రిలీజైన మొదటి చిత్రం కావడంతో.. ఛల్ మోహన్ రంగకు పవర్ స్టార్ ఫ్యాన్స్ సపోర్ట్ బాగా కనిపిస్తోంది. బట్ నితిన్ ఫ్యాన్స్ ఎక్కడమ్మా? ఇకపోతే ఈ సినిమా క్రిటిక్స్ ను అంతగా అలరించలేదు. అది సంగతి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు