మ‌రో బాంబు పేల్చిన శ్రీ‌రెడ్డి!

మ‌రో బాంబు పేల్చిన శ్రీ‌రెడ్డి!

ప్ర‌స్తుతం టాలీవుడ్ లో `శ్రీ‌రెడ్డి లీక్స్ `పై విప‌రీత‌మైన చ‌ర్చ జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ములను ఉద్దేశించి పరోక్షంగా శ్రీ‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆయ‌న స్పందించిన విషయం విదిత‌మే. అయితే, నిన్న సాయంత్రం ఓ టీవీషోలో పాల్గొన్న శ్రీ‌రెడ్డి...తాను శేఖ‌ర్ క‌మ్ముల‌నుద్దేశించి ఆ పోస్ట్ పెట్ట‌లేద‌ని యూట‌ర్న్ తీసుకుంది. తాజాగా, శ్రీ‌రెడ్డి త‌న ఫేస్ బుక్ ఖాతాలో మ‌రో షాకింగ్ పోస్టు పెట్టింది. ఓ టాలీవుడ్ హీరోను ఉద్దేశించి ఆ పోస్ట పెట్టినట్లు క‌నిపిస్తోంది.

ఆన్ స్క్రీన్ తో పాటు ఆఫ్ స్క్రీన్ లో కూడా ఆ హీరో `నేచుర‌ల్` గా న‌టిస్తాడ‌ని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ హీరో ఎంతోమంది అమ్మాయిల జీవితాల‌తో ఆడుకున్నాడ‌ని, వారిని వాడుకొని వ‌దిలేశాడ‌ని, వారంతా ఇప్ప‌టికీ ఏడుస్తున్నార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ప్ర‌స్తుతం శ్రీ‌రెడ్డి ఫేస్ బుక్ పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

``నువ్వు స్క్రీన్ మీదే కాదు.. నిజ జీవితంలో కూడా చాలా `నేచురల్` గా యాక్ట్ చేస్తావు. నేచురల్ గా కనిపిస్తావు. కానీ, అది కేవలం ముసుగు మాత్రమే. జీవితంలో చాలా కష్టాలు అనుభ‌వించాన‌ని జనాల సానుభూతి కోసం చెబుతుంటావు. జనాల ముందు  చాలా బాగా నాట‌కాలు ఆడ‌తావు. నీ క‌న్నా సూపర్ స్టార్లు చరణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లు బెస్ట్. వారికి ఏమాత్రం అహంభావం లేదు. వారి నుంచి నువ్వు చాలా నేర్చుకోవాలి. వాళ్ల తండ్రులు, తాతల అండ ఉన్నప్పటికీ...చాలా పద్ధ‌తిగా క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ఉంటారు. చిన్న దర్శకులను, ఇపుడిపుడే ఎదుగుతున్న దర్శకులను నువ్వు గౌరవించవు. కొద్ది రోజుల క్రితం నీకు కొడుకు పుట్టాడు. కంగ్రాట్యులేషన్స్. కానీ, జీవితంలో జాగ్రత్తగా ఉండు. నువ్వు వాడుకున్న అమ్మాయిలు ఇప్పటికీ ఏడుస్తున్నారు. ఒక విష‌యం గుర్తుంచుకో. న్యాయం ఎప్పుడూ మంచి వైపే ఉంటుంది. కాకపోతే శిక్ష ప‌డ‌డానికి స‌మ‌యం ప‌డుతుంది. నువ్వు కచ్చితంగా ఇబ్బందుల్లో పడతావు. సినీ పరిశ్రమ నిన్ను శిక్షిస్తుంది. ఇలాంటివన్నీ ఇండస్ట్రీ నుంచి ఈకలా రాలిపోవాలి`` అని శ్రీ‌రెడ్డి షాకింగ్ పోస్ట్ చేసింది. అయితే, ఈ పోస్ట్ లో ప‌రోక్షంగా కూడా ఎవ‌రిపేరును శ్రీ‌రెడ్డి ప్ర‌స్తావించ‌లేదు. తాజాగా శ్రీ‌రెడ్డి పేల్చిన బాంబుతో ఆ హీరో ఎవ‌రా అని నెటిజ‌న్లు చ‌ర్చించుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు