స్టయిలిష్ స్టార్ పై మండిపడుతున్న నెటిజన్లు

స్టయిలిష్ స్టార్ పై మండిపడుతున్న నెటిజన్లు

‘‘చెప్పను బ్రదర్’’ అన్న ఒక్క మాటతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు నెగిటివ్ అయ్యాడు అల్లు అర్జున్. అతడు చెప్పిన దానిలో అంత తప్పేం లేకపోయినా చెప్పిన టైం.. ప్లేస్ కరెక్ట్ కాకపోవడంతో బన్నీపై బోలెడన్ని నెగిటివ్ కామెంట్లు వచ్చాయి. దానిప్రభావం దువ్వాడ జగన్నాథమ్ ట్రయిలర్ రిలీజ్ టైంలో స్పష్టంగానే కనిపించింది. అల్లు అర్జున్ దాదాపుగా అలాంటి తప్పే లేటెస్ట్ గా మళ్లీ చేశాడు.

రీసెంట్ గా ఎక్స్ ప్రెస్ గ్రూప్ కు చెందిన ఒపీనియన్ ఎక్స్ ప్రెస్ అల్లు అర్జున్ ను కవర్ పేజ్ గా వేసి స్టయిలిష్ స్టార్ ఆఫ్ ది మిలీనియంగా ప్రకటించేసింది. లోపల పేజీల్లో బన్నీ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో అల్లు వారబ్బాయి తనకు ఇన్ స్పిరేషన్ మోడీ అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో.. మరీ ముఖ్యంగా ఆంధ్రాలో మోడీ పేరెత్తితే జనాలు మండిపడుతున్నారు. విభజన హామీల అమలులో మోడీ మాట మార్చిన తీరుపై ప్రజల్లో విపరీతమైన ఆగ్రహం ఉంది. ఇలాంటి టైంలో మోడీ ఏ రకంగా ఇన్ స్పిరేషనో చెప్పాలంటూ ఓ తెలుగు వాడిగా చెప్పాలంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

అల్లు అర్జున్ నెమ్మదిగా కోలీవుడ్ లోనూ పాగా వేయాలని చూస్తున్నాడు. బాలీవుడ్.. కోలీవుడ్ నుంచి తనకు ఆఫర్లు వస్తున్నాయని ఒపీనియన్ ఎక్స్ ప్రెస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. అటువైపు తమిళనాడులోనూ భాజపా తీరుపై తంబీలు కోపంగానే ఉన్నారు. అలాంటప్పుడు మోడీ గొప్పలు చెబితే ఎవరు మెచ్చుతారు? స్టయిలిష్ స్టార్ ఈ సింపుల్ మ్యాటర్ ఎలా మిస్సయ్యాడో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు